Aqui Thami: దేశంలోనే మొదటి స్త్రీవాద గ్రంథాలయం

ఆడవాళ్లకు మాత్రమే...అన్న బోర్డు చాలా చోట్ల చూసే ఉంటాం. ఈ లైబ్రరీ కూడా ఆడవాళ్ల ప్రత్యేకమే. కానీ, మగవారూ ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు.

Published : 04 Mar 2023 00:17 IST

డవాళ్లకు మాత్రమే...అన్న బోర్డు చాలా చోట్ల చూసే ఉంటాం. ఈ లైబ్రరీ కూడా ఆడవాళ్ల ప్రత్యేకమే. కానీ, మగవారూ ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. అదెలాగంటారా? అవునండీ ఇక్కడ ఉండే పుస్తకాలన్నీ మహిళలు రాసినవే. వాటిని ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు మరి. ఈ మొదటి స్త్రీవాద గ్రంథాలయం ముంబయి నగరంలోని ధారావి మురికివాడలో ఉంది. ఇది డార్జిలింగ్‌కి చెందిన ముప్పై రెండేళ్ల అక్విథామి ఆలోచనకు కలల రూపం. మహిళలకు అస్తిత్వం... ఒకరి భార్య, కూతురు, తల్లి మాత్రమేనా అన్న ఆలోచనలే తనని ‘సిస్టర్స్‌ లైబ్రరీ’ ఏర్పాటు దిశగా నడిపించాయి. అలాగని ఆమె ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తిగా ఊహించుకోవద్దు. తల్లిదండ్రులు తేయాకు తోటల్లో కూలీలు. సరైన ఆదాయం లేక ముంబయి నగరానికి చేరుకున్నవారికి ధారావీ మురికివాడ ఆశ్రయమిచ్చింది.

ఆ సమయంలో అక్విథామి జాత్యాహంకారాన్ని, వివక్షనూ చవి చూసింది. వాటిని ఎదుర్కోవడానికి కళలే సాయం చేస్తాయన్న నమ్మకం తనకి కొత్తదారిని చూపించాయి. ఇందుకోసం మొదట ‘ధారావి ఆర్ట్‌ రూమ్‌’ని ఏర్పాటు చేసింది. ఇక్కడికి వచ్చిన మురికివాడల పిల్లలు ఉచితంగా చదువుకునే వీలు కల్పించడంతో పాటు నచ్చిన కళను నేర్చుకునే అవకాశం అందించింది. ఈ క్రమంలోనే గ్రంథాలయం కోసం కొన్న పుస్తకాల్లో స్త్రీ రచనలు ఉండటాన్ని గమనించింది. వారి భావజాలంలోని సున్నితత్వాన్నీ కోణాల్నీ గమనించి మరింత లోతుగా వెతికే కొద్దీ ఎన్నో అద్భుతమైన పుస్తకాలు కనిపించాయి. దాంతో వాటితోనే కొనసాగించాలనే ఆలోచనతో ఆరేళ్ల క్రితం ‘సిస్టర్స్‌ లైబ్రరీ’ని ప్రారంభించింది. ఇక్కడ దేశీయ సాహిత్యంతో పాటూ నేపాల్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, అమెరికా దేశాల రచనలూ అందుబాటులో ఉన్నాయి. కొవిడ్‌ విజృంభణకు ముందు ‘సిస్టర్‌ రేడియో’ పేరిట ఓ పాడ్‌కాస్ట్‌ ఛానెల్‌నీ ప్రారంభించింది. సిస్టర్‌ ప్రెస్‌ని ఏర్పాటు చేసి స్థానిక మహిళల సాయంతో ‘సిస్టర్‌ టైమ్స్‌’ మాసపత్రికను ముద్రిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్