నెయిల్‌ ఆర్ట్‌ అతికించుకోవచ్చు!

సాధారణ నెయిల్‌ పాలిష్‌ వేసుకోవడం సులువే! కానీ నెయిల్‌ ఆర్ట్‌ వేసుకోవాలన్నా, డెకరేటివ్‌ పీసెస్‌తో గోళ్లకు అదనపు హంగులద్దాలన్నా కాస్త సమయం వెచ్చించాల్సిందే!

Published : 25 Nov 2023 18:33 IST

సాధారణ నెయిల్‌ పాలిష్‌ వేసుకోవడం సులువే! కానీ నెయిల్‌ ఆర్ట్‌ వేసుకోవాలన్నా, డెకరేటివ్‌ పీసెస్‌తో గోళ్లకు అదనపు హంగులద్దాలన్నా కాస్త సమయం వెచ్చించాల్సిందే! పైగా అందరికీ నెయిల్‌ ఆర్ట్‌ వేసుకునే నైపుణ్యాలు ఉండచ్చు.. ఉండకపోవచ్చు.. అలాంటి వారి కోసం విభిన్న నెయిల్‌ ఆర్ట్‌ స్ట్రిప్స్‌ మార్కెట్లో దొరుకుతున్నాయి.

ఫొటోల్లో చూపించినట్లుగా అచ్చం గోళ్ల ఆకృతిలో ఉండే ఈ స్ట్రిప్స్‌పై విభిన్న డిజైన్లలో నెయిల్‌ ఆర్ట్‌ తీర్చిదిద్దారు. ఫ్లోరల్‌, షిమ్మరీ, జామెట్రిక్‌ డిజైన్స్‌, బార్బీ డాల్స్‌, అమ్మాయిల బొమ్మలు, సీతాకోక చిలుకలు, మర్మెయిడ్‌ ఫ్లేక్స్‌తో హంగులద్దినవి, న్యూడ్‌ నెయిల్‌ ఆర్ట్‌ స్ట్రిప్స్‌, పేస్టల్‌ షేడ్స్‌లో ప్లెయిన్‌గా రూపొందించినవి.. ఇలా చెప్పుకుంటూ పోతే నెయిల్‌ ఆర్ట్‌ స్ట్రిప్స్‌ డిజైన్లకు కొదవే లేదు. ఇవి షీట్స్‌ మాదిరిగా దొరుకుతాయి. వీటిని అతికించుకోవడం చాలా సింపుల్‌. ముందుగా ఆల్కహాల్‌ ప్యాడ్‌ రిమూవర్‌తో గోళ్లను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత గోరుకు సరిపోయే స్ట్రిప్‌ను షీట్‌ నుంచి లాగి గోరుపై గ్యాప్‌ లేకుండా అతికించాలి. ఆపై కాస్త ప్రెస్‌ చేసి.. అదనంగా ఉన్న స్ట్రిప్‌ను కట్‌ చేస్తే సరిపోతుంది. వీటిని కావాలనుకున్నప్పుడు తొలగించి.. వేరే స్ట్రిప్‌ను ఇదేవిధంగా అతికించుకోవచ్చు.

ఒకవేళ ప్లెయిన్‌గా ఉన్న స్ట్రిప్స్‌ను అతికించుకున్న వారు.. వాటిపై డెకరేట్‌ చేసుకోవడానికి విభిన్న నెయిల్‌ ఆర్ట్‌ డెకరేటివ్‌ పీసెస్‌ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ఫ్రూట్‌ స్లైసెస్‌లా కట్‌ చేసినవి, గుండ్రంగా ఉన్న గ్లిట్టర్‌ సీక్విన్స్‌, ఎండబెట్టిన పూల గుత్తుల మాదిరిగా ఉన్న అలంకరణలు, గోల్డ్‌ కలర్‌ నెయిల్‌ ఆర్ట్‌ యాక్సెసరీస్‌, త్రీడీ లేజర్‌ టేప్స్‌, గోల్డెన్‌ బీడ్స్‌, లేస్‌ మాదిరిగా ఉండే డెకరేటివ్‌ పీసెస్‌, త్రీడీ ఎంబోస్‌డ్‌ ఫ్లవర్స్‌.. వంటివెన్నో లభిస్తున్నాయి. మీరు అతికించుకున్న స్ట్రిప్స్‌పై క్లియర్‌/ట్రాన్స్‌పరెంట్‌ నెయిల్‌ పాలిష్‌ పూసి.. ఆపై డాటింగ్‌ టూల్‌ లేదా ప్లకర్‌ సహాయంతో నచ్చిన డెకరేటివ్‌ పీసెస్‌ని గోళ్లపై అతికించుకుంటే సరి! ఇలా క్షణాల్లోనే గోళ్లను అందంగా మార్చేసే నెయిల్‌ ఆర్ట్‌ స్ట్రిప్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి!

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్