అక్కడ అలర్జీ.. కారణమేమిటి?

నాకు 22 ఏళ్లు. నాకు కొన్ని రోజుల నుంచి వెజైనా చుట్టూ దురదగా ఉంటోంది. రోజురోజుకీ సమస్య ఎక్కువవుతోంది. అంతకు ముందు నాకు నీళ్లు పడక శరీరమంతా దురదగా ఉండేది....

Updated : 23 May 2024 13:34 IST

నాకు 22 ఏళ్లు. నాకు కొన్ని రోజుల నుంచి వెజైనా చుట్టూ దురదగా ఉంటోంది. రోజురోజుకీ సమస్య ఎక్కువవుతోంది. అంతకు ముందు నాకు నీళ్లు పడక శరీరమంతా దురదగా ఉండేది. ఇప్పుడు ఆ సమస్య తగ్గిపోయి.. ఈ కొత్త సమస్య మొదలైంది. దీనికి పరిష్కారం ఏమిటి? - ఓ సోదరి

జ: మీకు ఇంతకు ముందు కూడా అలర్జీ సమస్య ఉందని రాశారు. కాబట్టి వెజైనా చుట్టూ ఉండే దురద అలర్జీ వల్ల కాదని ముందుగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఒక్కోసారి వెజైనల్‌ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా రావచ్చు. అందుకని ముందుగా గైనకాలజిస్ట్‌ని సంప్రదించి.. ఇన్ఫెక్షన్‌ ఉంటే అది దేనివల్ల వచ్చిందో తెలుసుకొని సంబంధిత మందులు వాడాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్‌ ఏమీ లేదు.. చర్మానికి సంబంధించిన సమస్యే అని తేలితే ఒకసారి చర్మవ్యాధి నిపుణులను సంప్రదించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్