ఖాళీ కడుపుతో మంచిదేనా?

పొద్దున లేవగానే స్కూళ్లు, కార్యాలయాలు.. ఒకటే హడావుడి. మనకంటూ సమయం కేటాయించేది ఎప్పుడు..? రోజులో నడక, జాగింగ్‌, సైక్లింగ్‌లో ఏదోటి భాగం చేసుకోవాలంటారు వైద్యులు.

Published : 03 Mar 2023 00:08 IST

పొద్దున లేవగానే స్కూళ్లు, కార్యాలయాలు.. ఒకటే హడావుడి. మనకంటూ సమయం కేటాయించేది ఎప్పుడు..? రోజులో నడక, జాగింగ్‌, సైక్లింగ్‌లో ఏదోటి భాగం చేసుకోవాలంటారు వైద్యులు. దీనికి ఖాళీ కడుపుతో వ్యాయామానికి సంబంధమేంటనుకుంటున్నారా? అల్పాహారం ముందు చేసే కాస్తంత వర్కవుట్‌.. బోల్డన్ని ప్రయోజనాలను ఇస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటో తెలుసుకుందామా...

పరగడుపున గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం, నానబెట్టిన గుప్పెడు బాదం తినడం అలవాటు చేసుకోండి. వీటితోపాటు వాకింగ్‌, సైక్లింగ్‌, కాసేపు పరిగెత్తడం  చేయండి. దీంతో మీ మెదడు ఉత్తేజితమవుతుంది. ఒత్తిడి దరిచేరదు. రోజంతా తాజాగా ఉండగలుగుతారు.

* బరువు తగ్గాలనుకునేవారు ఓ అరగంట వ్యాయామానికి కేటాయిస్తే చాలు. శరీరంలో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. హార్మోన్ల అసమతుల్యత  అదుపులోకి వస్తుంది. ఎముకలు పుష్టిగా తయారవుతాయి. గంటలకొద్దీ చేయాలన్న  తాపత్రయం వద్దు.

* ఉదయాన్నే ప్రోటీన్లతో నిండిన అల్పాహారాన్ని ఇవ్వండి. ఇది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

* టైప్‌-2 డయాబెటిస్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. గ్లూకోజ్‌ స్థాయుల్ని తగ్గించి, ఇన్సులిన్‌ స్థాయుల్ని సమన్వయపరుస్తుంది. ఎరోబిక్స్‌, ఈత కొట్టడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. దీంతో అధిక రక్తపోటు ముప్పు తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్