బేబీ బ్లూస్‌... నిర్లక్ష్యం వద్దు

మన జీవితాల్లోకి పిల్లలు తెచ్చే ఆనందం ఎక్కువే. అయితే, ఈ క్రమంలో తల్లిలో ఏర్పడే శారీరక, మానసిక మార్పులు ‘బేబీ బ్లూస్‌’ కి కారణమవుతాయి. అంటే, తెలియని ఆందోళన, కుంగుబాటు, సైకోసిస్‌... లాంటి సమస్యలెన్నో వారిని ఉక్కిరిబిక్కిరి చేయడం.

Published : 27 May 2024 02:49 IST

మన జీవితాల్లోకి పిల్లలు తెచ్చే ఆనందం ఎక్కువే. అయితే, ఈ క్రమంలో తల్లిలో ఏర్పడే శారీరక, మానసిక మార్పులు ‘బేబీ బ్లూస్‌’ కి కారణమవుతాయి. అంటే, తెలియని ఆందోళన, కుంగుబాటు, సైకోసిస్‌... లాంటి సమస్యలెన్నో వారిని ఉక్కిరిబిక్కిరి చేయడం. ప్రపంచవ్యాప్తంగా 10శాతం గర్భిణులు, 13శాతం బాలింతలు ఇటువంటి మానసిక సమస్యల బారిన పడుతున్నట్లు తాజా లాన్సెట్‌ రిపోర్టు నివేదించింది. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ 5నుంచి 25శాతం తల్లుల ఆత్మహత్యలకు కారణం ఇదేనట. సుమారు 85శాతం మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయట. అయితే, అందులో 70శాతం మంది వాటిని గుర్తించలేక బయటకు చెప్పలేకపోతున్నారట. దీని ప్రభావం బిడ్డ ఆరోగ్యంపైన పడడంతోపాటు, తల్లీబిడ్డ మధ్య బంధం ఏర్పడడంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయట. దీర్ఘకాలంలో ఇది పిల్లలపై శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగానూ ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఆ సమయంలో తల్లికి తగిన సహకారం అందిస్తూ మానసిక ఆరోగ్యానికి తోడ్పడాల్సిన అవసరం కుటుంబ సభ్యులపై ఉంటుంది. అందుకోసం ఇలాంటి సమస్యలేమైనా ఉంటే వాటి గురించి బహిరంగంగా చర్చించడం, అవగాహన కల్పించడం, మొదట్లోనే గుర్తించి చికిత్స చేయించడం లాంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్