డ్రోన్లతో ప్రాణాలు నిలబెడుతూ..!

వచ్చేది వర్షాకాలం... వరదలు పోటెత్తడం సహజం. ఇలాంటప్పుడు కొండకోనల్లో, లంకల్లో చిక్కుకున్న వారికి మందులు అందించడం పెద్ద సవాలే కదా! దీనికి చక్కని పరిష్కారం అందిస్తున్నారు డ్రోన్‌దీదీలు. డ్రోన్‌ల సాయంతో ఔషధాలు చేరవేస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు.  చంబా, తెహ్రీ, హిందోలాఖల్‌ ప్రాంతాలు ఉత్తరాఖండ్‌లోని మూరుమూల కొండప్రాంతాలు.

Published : 29 May 2024 03:43 IST

వచ్చేది వర్షాకాలం... వరదలు పోటెత్తడం సహజం. ఇలాంటప్పుడు కొండకోనల్లో, లంకల్లో చిక్కుకున్న వారికి మందులు అందించడం పెద్ద సవాలే కదా! దీనికి చక్కని పరిష్కారం అందిస్తున్నారు డ్రోన్‌దీదీలు. డ్రోన్‌ల సాయంతో ఔషధాలు చేరవేస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. 

చంబా, తెహ్రీ, హిందోలాఖల్‌ ప్రాంతాలు ఉత్తరాఖండ్‌లోని మూరుమూల కొండప్రాంతాలు. రవాణా సదుపాయాలు అంతంత మాత్రంగా ఉండే ఈ ప్రాంతాలకు అత్యవసర సమయంలో మందులు చేరవేయడం పెద్ద సవాల్‌గా మారింది. ఈ సమస్యని పరిష్కరించేందుకు ఆల్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ రిషికేశ్‌ మొదటిసారి డ్రోన్‌ల సాయంతో వ్యాక్సిన్లు, ఔషధాలు అందించాలని సంకల్పించింది. ఇందుకు డ్రోన్‌ల నిర్వహణలో శిక్షణ తీసుకున్న డ్రోన్‌దీదీల సాయం తీసుకుంది. మెడికల్‌ డ్రోన్‌లని నడిపే మమతారాతురీ, పుష్పాచౌహాన్‌ వంటివారు ఈ ప్రాజెక్ట్‌లో చురుగ్గా ఉన్నారు. వీరు మెడికల్‌ డ్రోన్‌ల సాయంతో టీబీ మందులు, వ్యాక్సిన్లు ఎయిమ్స్‌ నుంచి నిర్దేశిత ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తారు. అక్కడున్న దీదీలు ఈ మందులని తీసుకుని, తిరిగి రోగుల బ్లడ్‌ శాంపిళ్లు వంటివి పంపిస్తూ, త్వరితగతిన వైద్య సేవలు అందేట్టు చేస్తున్నారు. ‘మా ఆసుపత్రి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాలకు రోడ్డు దారిలో చేరుకోవడానికి నాలుగు నుంచి ఐదుగంటల సమయం పడుతుంది. అదే డ్రోన్‌లు అయితే కేవలం అరగంటలో మందుల్ని చేరవేస్తున్నాయి. అయితే ఈ డ్రోన్‌లను నడిపేవారు ఎప్పటికప్పుడు బ్యాటరీలను చూసుకోవడం, కేంద్రాలకు అవి ఏ ఆటంకం లేకుండా చేరుకొనేలా పర్యవేక్షించడం... వంటివి మా బృందం చక్కగా చేస్తోంది. రెండు డ్రోన్‌ల సాయంతో ప్రతిరోజూ 12 కిలోల ఔషధాలని ఆయా ప్రాంతాలకి చేరవేస్తున్నాం. స్వయం సహాయక బృందాలకు చెందిన సాధారణ మహిళలు ఇంత గొప్పపని చేస్తున్నారు’ అంటున్నారు ఎయిమ్స్‌ రిషికేశ్‌ డైరెక్టర్‌ మీనూ సింగ్‌. ఈ ప్రాజెక్ట్‌ ఇచ్చిన స్ఫూర్తితో ఎయిమ్స్‌ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సేవల్ని  అందించే ప్రయత్నం చేస్తుందట.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్