PCOS ఉంటే.. ముఖం రంగు మారుతుందా?

నాకు పాతికేళ్లు. నాకు పీసీఓఎస్ సమస్య ఉంది. దీనివల్ల పిరియడ్స్ రెగ్యులర్‌గా రావు. నా బరువు ఎత్తుకు తగ్గట్టుగానే ఉంది. కానీ నా ముఖం స్కిన్‌టోన్‌ సరిగా ఉండదు. మిగతా శరీరం కంటే ముఖం నల్లగా ఉంటుంది....

Published : 30 Mar 2024 13:06 IST

నాకు పాతికేళ్లు. నాకు పీసీఓఎస్ సమస్య ఉంది. దీనివల్ల పిరియడ్స్ రెగ్యులర్‌గా రావు. నా బరువు ఎత్తుకు తగ్గట్టుగానే ఉంది. కానీ నా ముఖం స్కిన్‌టోన్‌ సరిగా ఉండదు. మిగతా శరీరం కంటే ముఖం నల్లగా ఉంటుంది. ముఖం రంగుకి, పీసీఓఎస్‌కు ఏమైనా సంబంధం ఉంటుందా? ముఖం తెల్లగా మారాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ ఫేస్ స్కిన్‌టోన్‌ సరిగా ఉండదని అంటున్నారు. అలాగే మీకు పీసీఓఎస్ ఉందని చెబుతున్నారు. ఈ సమస్య ఉన్నప్పుడు నెలసరి క్రమం తప్పడమే కాకుండా పలు రకాల సమస్యలు వస్తుంటాయి. మొటిమలు, పిగ్మెంటేషన్, బరువు పెరగడం, జుట్టు ఊడిపోవడం, అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరగడం వంటివన్నీ ఇందులో భాగమే.
అలాగే ముఖం రంగుకి, హార్మోన్ల సమస్యకు సంబంధం ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారిలో ముఖంపై కొన్నిచోట్ల సాధారణంగా, మరికొన్ని చోట్ల పొడిబారినట్లుగా ఉంటుంది. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి ముందుగా రక్త పరీక్షలతో పాటు హార్మోన్లకు సంబంధించిన పరీక్షలు కూడా చేయించుకోవాలి. అలాగే మీది ఎలాంటి చర్మతత్వమో తెలుసుకోవాలి. ఎందుకంటే చర్మతత్వాన్ని బట్టి ఉపయోగించే సబ్బు దగ్గర్నుంచి క్రీముల వరకు అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఈ సమస్య ఉన్నవారిలో కొన్నిచోట్ల చర్మం పొడిగా ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజ్‌ చేసుకోవాలి. అలాగే సన్‌స్క్రీన్‌ను రెగ్యులర్‌గా ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా చాలావరకు సమస్యను తగ్గించుకోవచ్చు. అయితే వీటికి తోడు పీసీఓఎస్‌కు సంబంధించిన చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటే మరిన్ని ఫలితాలు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్