గుక్కపట్టి ఏడుస్తుంటాడు!

మా బాబు వయసు ఎనిమిది నెలలు. మామూలుగా బాగానే ఉంటాడు. కానీ, ఒక్కోసారి ఏడవడం మొదలుపెడితే అస్సలు ఆపడు. చాలాసేపు గుక్కపట్టి ఏడుస్తుంటాడు. అలా ఎందుకు ఏడుస్తాడో అస్సలు అర్థం కాదు.

Published : 21 Feb 2024 13:16 IST

మా బాబు వయసు ఎనిమిది నెలలు. మామూలుగా బాగానే ఉంటాడు. కానీ, ఒక్కోసారి ఏడవడం మొదలుపెడితే అస్సలు ఆపడు. చాలాసేపు గుక్కపట్టి ఏడుస్తుంటాడు. అలా ఎందుకు ఏడుస్తాడో అస్సలు అర్థం కాదు. ఇదేమైనా సమస్యా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. సాధారణంగా పసిపిల్లలకు ఏ సమస్య వచ్చినా దాన్ని ఏడుపు రూపంలోనే వ్యక్తం చేస్తుంటారు. కాబట్టి పిల్లలు ఏడ్చిన ప్రతిసారీ ఏదో సమస్య ఉన్నట్టు కాదు. కానీ, దానికి గల కారణం తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. చాలామంది పిల్లలు ఆకలి వల్ల ఏడుస్తుంటారు. మరికొంతమంది చిన్న చిన్న గాయాలవడం, దుస్తులు బిగుతుగా ఉండడం, ఎక్కువ చలి/వేడికి తట్టుకోకపోవడం, ఉక్కపోతగా అనిపించడం.. ఇలాంటి చిన్న చిన్న అసౌకర్యాల్ని కూడా ఏడుపు రూపంలో వ్యక్తం చేస్తుంటారు. దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే శరీరంలో ఏదైనా ప్రాంతంలో నొప్పి వల్ల ఏడుస్తున్నట్లయితే ఆలోచించాలి. నొప్పి ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలో కాస్త నొక్కి చూడాలి. ఒకవేళ నొప్పి ఉంటే ఆ భాగాన్ని ముట్టుకోనివ్వరు.. ఇంకా ఎక్కువగా ఏడుస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. వాళ్లు అసలు సమస్యేంటో తెలుసుకొని పరిష్కారం చూపుతారు.. అంతేకానీ అనవసరంగా కంగారు పడాల్సిన అవసరం లేదు.

ప్రత్యేకించి బాబు ఆహారం తీసుకోవడం, నిద్ర పోవడం, ఆడుకోవడం అన్నీ బాగానే ఉండి.. మధ్యమధ్యలో అప్పుడప్పుడు ఏడుస్తున్నట్లయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా అకారణంగానే పదే పదే ఏడుస్తున్నట్లయితే కొన్ని పరీక్షలు చేయించడం మంచిది. కొంతమంది పిల్లలు కడుపులో మెలి తిప్పినట్లు ఉండడం, తలలో ఏమైనా ఇబ్బంది ఉండడం వల్ల కూడా ఏడుస్తుంటారు. కాబట్టి, వాటికి సంబంధించిన పరీక్షలు డాక్టర్‌ సలహా మేరకు చేయించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్