హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకుంటే ఆ క్యాన్సర్లు రావా?

మా అత్తగారికి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ (Cervical cancer) వచ్చింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ మధ్య ఇలాంటి క్యాన్సర్‌ నాకు తెలిసిన చాలామంది మహిళల్లో చూశాను. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్‌ను నివారించవచ్చని....

Published : 03 Apr 2023 15:38 IST

మా అత్తగారికి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ (Cervical cancer) వచ్చింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ మధ్య ఇలాంటి క్యాన్సర్‌ నాకు తెలిసిన చాలామంది మహిళల్లో చూశాను. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్‌ను నివారించవచ్చని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? ఈ వ్యాక్సిన్‌ను ఎవరు తీసుకోవచ్చు? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ (Cervical cancer) హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల వస్తుంటుంది. ఈ వైరస్‌ను నివారించడానికి వ్యాక్సిన్‌ను తయారు చేశారు. దానినే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ అంటుంటాం. ఈ వ్యాక్సిన్‌ కేవలం సర్వైకల్‌ క్యాన్సర్‌ను మాత్రమే కాకుండా వెజైనల్‌ క్యాన్సర్‌, వల్వర్‌ క్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది. ఈ వ్యాక్సిన్ 9 నుంచి 45 సంవత్సరాల మహిళలు ఎవరైనా తీసుకోవచ్చు.

ఈ మధ్య సర్వైకల్‌ క్యాన్సర్‌కు గార్డసిల్‌ 9 అనే మరొక వ్యాక్సిన్‌ కూడా వచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను కేవలం అమ్మాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిలు కూడా తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్‌ పురుషుల్లో హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ వల్ల వచ్చే క్యాన్సర్లు, ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి, తప్పకుండా ప్రతి అమ్మాయి ఈ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. 9 నుంచి 17 సంవత్సరాల లోపు అమ్మాయిలు రెండు డోసులు తీసుకుంటే సరిపోతుంది. ఒక డోసు తీసుకున్న తర్వాత రెండో డోసును రెండు నెలల తర్వాత తీసుకోవాలి. 15 సంవత్సరాలు దాటిన వారు మాత్రం మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. వీరు ఒక డోసు తీసుకున్న రెండు నెలల తర్వాత రెండో డోసు తీసుకోవాలి. ఇక మూడో డోసుని ఆరు నెలల తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది.

అమ్మాయిలు పెళ్లి కాక ముందు, రిలేషన్‌షిప్‌లోకి వెళ్లకముందే ఈ వ్యాక్సిన్‌ తీసుకుంటే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఈ వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్