పీసీఓఎస్ వస్తే ఇంక తగ్గదా? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

నమస్తే మేడమ్‌. నా వయసు 22. నాకు పీసీఓఎస్‌ ఉందని ఇటీవలే తెలిసింది. ఇది దీర్ఘకాలిక సమస్య అని, పూర్తిగా నయం కాదని చదివాను. అప్పట్నుంచి ఏదో తెలియని భయం. ఇది నిజంగానే నయం కాని సమస్యా? పీసీఓఎస్‌ ఉంటే ఎలాంటి....

Published : 28 Mar 2023 21:15 IST

నమస్తే మేడమ్‌. నా వయసు 22. నాకు పీసీఓఎస్‌ ఉందని ఇటీవలే తెలిసింది. ఇది దీర్ఘకాలిక సమస్య అని, పూర్తిగా నయం కాదని చదివాను. అప్పట్నుంచి ఏదో తెలియని భయం. ఇది నిజంగానే నయం కాని సమస్యా? పీసీఓఎస్‌ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? - ఓ సోదరి

జ: పీసీఓఎస్‌ అనేది దీర్ఘకాలిక సమస్య అని మీరు చదివింది సరైందే.. కానీ భయపడడం అనవసరం. పీసీఓఎస్‌ ఉన్నా కూడా అది ఎప్పటికీ మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుందని అనుకోనవసరం లేదు. దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అన్నింటికంటే ముఖ్యమైనది. బరువు ఎప్పుడూ అదుపులో ఉండాలి. వ్యాయామం చేయడం మీ జీవనశైలిలో ఒక భాగం కావాలి. అయితే పీసీఓఎస్‌లో ఉండే హార్మోన్ల అసమతుల్యతను, మెటబాలిక్‌ సమస్యల్ని సరిచేయడానికి చక్కని మందులున్నాయి. అలాగే గర్భం నిలవకపోతే అండం విడుదల కోసం వాడడానికి కూడా మంచి మందులున్నాయి. ఇవన్నీ కూడా సత్ఫలితాలనిస్తాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడంతో పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు చెకప్‌ చేయించుకుంటూ ఉండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్