పిల్లలకు దగ్గు, జ్వరం వచ్చి తగ్గడం లేదు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈ మధ్య పిల్లలకు అకస్మాత్తుగా దగ్గు, జ్వరం వంటి సమస్యలు వచ్చి తగ్గడం లేదు. ఇవి కూడా దాదాపు కరోనా లక్షణాల మాదిరిగానే ఉంటున్నాయి. దీనికి చికిత్స ఉందా? పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి....
ఈ మధ్య పిల్లలకు అకస్మాత్తుగా దగ్గు, జ్వరం వంటి సమస్యలు వచ్చి తగ్గడం లేదు. ఇవి కూడా దాదాపు కరోనా లక్షణాల మాదిరిగానే ఉంటున్నాయి. దీనికి చికిత్స ఉందా? పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.
జ. మీరు చెబుతున్నట్లు ఈ మధ్య పిల్లలతో పాటు పెద్దల్లోనూ దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తున్నాయి. సీజనల్ మార్పుతో పాటు ఎడినో వైరస్, ఇన్‌ఫ్లుయెంజా వంటి వైరస్‌ల వల్ల ఇవి ఎటాక్ అవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు దగ్గు, జలుబు, తలనొప్పి, బాడీ పెయిన్స్‌తో పాటు కొద్దిగా జ్వరం కూడా ఉంటుంది. ఈ లక్షణాలు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉంటాయి. పారాసిటమాల్, యాంటీహిస్టమైన్ మందులు తీసుకుంటే సమస్య నెమ్మదిగా తగ్గుతుంది. అలాగే పిల్లలను ఇంటి వద్దే ఉంచడం, పౌష్టికాహారం అందించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
కానీ, కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దానివల్ల కొన్ని రకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు సైనస్ ఇన్ఫెక్షన్లు, టాన్సిల్స్, ఎడినాయిడ్స్, న్యుమోనియా వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొంతమంది పిల్లలకు విరేచనాలు అవుతుంటాయి. ఇలాంటప్పుడు హాస్పిటల్‌లో చేర్చి కొన్ని రకాల యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎవరూ వీటిని సొంతంగా తీసుకోకూడదు. ఎందుకంటే ప్రతి పదిమందిలో తొమ్మిది మందికి యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా కొద్దిమందిలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే వీటిని వాడాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.