రెండోసారి గర్భం రావట్లేదు.. అందుకేనా?

హలో డాక్టర్. నాకు 30 ఏళ్లు. ఒక పాప. పాప పుట్టాక రెండేళ్లకి నాకు థైరాయిడ్‌ ఉందని తెలిసింది. అప్పట్నుంచి 75mcg మాత్రలు వాడుతున్నా.

Published : 02 Dec 2023 15:40 IST

హలో డాక్టర్. నాకు 30 ఏళ్లు. ఒక పాప. పాప పుట్టాక రెండేళ్లకి నాకు థైరాయిడ్‌ ఉందని తెలిసింది. అప్పట్నుంచి 75mcg మాత్రలు వాడుతున్నా. నెలసరి సమయానికే వస్తుంది. కానీ రుతుచక్రం పూర్తయ్యాక కడుపు నొప్పిగా ఉంటుంది. ప్రస్తుతం మేము మరో బేబీ కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ గర్భం రావట్లేదు. పిల్లలు పుట్టే మార్గం చెప్పండి. - ఓ సోదరి

జ: మీరు బిడ్డ కోసం ప్రయత్నించడం మొదలుపెట్టి ఏడాది దాటితే ఎందుకు సక్సెసవ్వట్లేదో తప్పనిసరిగా పరీక్షలన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. అండం విడుదల, హార్మోన్ల స్థాయుల్ని తెలుసుకోవడానికి.. ఫెలోపియన్‌ ట్యూబుల్లో అడ్డంకులు లేవని నిర్ధరించుకోవడానికి.. అవసరమైన పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ వారికి సెమెన్‌ అనాలసిస్‌ పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే ఈ పరీక్షలన్నీ చేసి.. మీకు ఏ చికిత్స ద్వారా పిల్లలు పుడతారో చెప్పగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్