ఎండ వల్లే దురద, దద్దుర్లు వస్తున్నాయా?

నా వయసు 35 సంవత్సరాలు. నాకు మెడ, చేతుల పైన దురదగా ఉంటోంది. అలాగే దద్దుర్లు కూడా ఉన్నాయి. నేను ఎక్కువగా ఎండలో గార్డెనింగ్‌ చేస్తుంటాను. ఎండలో ఉండడం వల్లే దురద, దద్దుర్లు వస్తున్నాయా? ఈ సమస్య రాత్రుళ్లు కూడా ఉంటోంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే...

Updated : 12 Mar 2023 14:53 IST

నా వయసు 35 సంవత్సరాలు. నాకు మెడ, చేతుల పైన దురదగా ఉంటోంది. అలాగే దద్దుర్లు కూడా ఉన్నాయి. నేను ఎక్కువగా ఎండలో గార్డెనింగ్‌ చేస్తుంటాను. ఎండలో ఉండడం వల్లే దురద, దద్దుర్లు వస్తున్నాయా? ఈ సమస్య రాత్రుళ్లు కూడా ఉంటోంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరు ఎండలో ఎక్కువసేపు గార్డెనింగ్‌ చేస్తుంటానని చెప్పారు. కేవలం ఎండ వల్లే కాకుండా గార్డెనింగ్‌ వల్ల కూడా చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గార్డెనింగ్‌లో భాగంగా మొక్కలకు వివిధ రకాల పెస్టిసైడ్స్‌ వాడడమే ఇందుకు కారణం. ఇందులో ఉండే కెమికల్స్ చేతికి అంటుకోవడం లేదా కెమికల్స్ చల్లిన మొక్కలను పట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి, గార్డెనింగ్‌ చేసే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుండాలి.

1. గార్డెనింగ్‌ చేస్తున్నప్పుడు తప్పకుండా చేతులకు గ్లోవ్స్ ధరించాలి.

2. ఎక్కువసేపు ఎండలో ఉంటారు కాబట్టి శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. వీలైనంతవరకు కాటన్‌ దుస్తులు ధరించడం మంచిది.

3. శరీరంపై ఎండ పడకుండా ఉండేందుకు వెడల్పుగా ఉండే టోపీలు ధరిస్తుండాలి.

4. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శరీరంపై ఎండ ప్రభావాన్ని తగ్గించేందుకు సన్‌స్క్రీన్‌ను ప్రతి మూడు గంటలకు ఒకసారి అప్లై చేస్తుండాలి. మీరు ఉపయోగించే సన్‌స్క్రీన్‌ ఎస్‌పీఎఫ్‌ 50 అంతకంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ఈ పై జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండచ్చు.

మీకు ఇప్పటికే చర్మ సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. కాబట్టి, ముఖ్యంగా గార్డెనింగ్‌ పని పూర్తైన తర్వాత గ్లోవ్స్ తీసేసి మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాలి. ఒకవేళ సమస్య తగ్గడం లేదంటే కొబ్బరినూనెను అప్లై చేసుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నా సమస్య ఉందంటే చర్మ సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్