సన్‌స్క్రీన్ పడడం లేదు.. ఏం చేయాలి?
నా వయసు 28 సంవత్సరాలు. నాకు సన్‌స్క్రీన్ లోషన్ అస్సలు పడడం లేదు. ఇది అప్లై చేసిన కాసేపటికే చర్మంపై ర్యాషెస్ లాగా వస్తున్నాయి. బేసిగ్గా నాది పొడి చర్మం. నేను ఎలాంటి సన్‌స్క్రీన్ ఉపయోగిస్తే మంచిది. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
నా వయసు 28 సంవత్సరాలు. నాకు సన్‌స్క్రీన్ లోషన్ అస్సలు పడడం లేదు. ఇది అప్లై చేసిన కాసేపటికే చర్మంపై ర్యాషెస్ లాగా వస్తున్నాయి. బేసిగ్గా నాది పొడి చర్మం. నేను ఎలాంటి సన్‌స్క్రీన్ ఉపయోగిస్తే మంచిది. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. మీకు సన్‌స్క్రీన్ లోషన్ పడట్లేదని అంటున్నారు. సన్‌స్క్రీన్‌ని చర్మతత్వాన్ని బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, డాక్టర్ సలహా మేరకు మీ చర్మతత్వానికి సరిపోయే లోషన్‌ని ఎంపిక చేసుకోండి. సన్‌స్క్రీన్ వాడకం వల్ల పలు ప్రయోజనాలు చేకూరతాయి. దీన్ని అప్లై చేసుకోవడం వల్ల చర్మం కమిలిపోవడం, ట్యాన్ సమస్యల నుంచి ఉపశమనం పొందచ్చు. అలాగే చర్మ క్యాన్సర్ రాకుండానూ ఇది కాపాడుతుంది. SPF 30 విలువ గల సన్‌స్క్రీన్ ఎంచుకుంటే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు.
మీది పొడి చర్మం అని చెప్పారు. కాబట్టి, క్రీమ్ ఆధారిత సన్‌స్క్రీన్ లోషన్ వాడడం మంచిది. దీనివల్ల చర్మం తేమను సంతరించుకుంటుంది. కొంతమందిలో చర్మ అలర్జీకి సంబంధించిన వివిధ రకాల సమస్యలొస్తుంటాయి. ఇలాంటివారు.. పారా అమైనో బెంజోయిక్ యాసిడ్, బెంజోన్స్, ఆల్కహాల్, ఆస్ట్రిన్జెంట్స్.. వంటి రసాయనాలు లేని ఉత్పత్తుల్ని ఎంచుకోవాలి. అలాగే జింక్ ఆక్సైడ్, టైటానియమ్ డై ఆక్సైడ్ వంటివి ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా ర్యాషెస్ లాంటి సమస్యలు రాకుండా ఉంటుంది.
ఒకసారి సన్‌స్క్రీన్ అప్లై చేస్తే రోజంతా నిలిచి ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ అది కేవలం రెండు గంటల పాటు మాత్రమే చర్మానికి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి, ప్రతి రెండు గంటలకోసారి సన్‌స్క్రీన్‌ను అప్లై చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
- అందానికి చింతపండు..!
- నిర్మలమ్మ ‘బడ్జెట్’ శారీస్.. చీరచీరకో ప్రత్యేకత!
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
ఆరోగ్యమస్తు
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
- ‘అమ్మా’ అనే పిలుపు వినాలని!
- మీ మౌత్‌వాష్ ఎలాంటిది?
- చాందీపుర వైరస్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
అనుబంధం
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- నియమం ‘777’తో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
- Sushmita Sen: లైంగిక అంశాల గురించి నా పిల్లలతో అలా చర్చిస్తా!
యూత్ కార్నర్
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
- రెండేళ్ల కష్టం... రూ.54 లక్షల ఉద్యోగం!
- మలార్ వాట్సాప్... టీచర్!
'స్వీట్' హోం
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
- వ్యాపారమా... ఉద్యోగమా?
వర్క్ & లైఫ్
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!
- ఆఫీసులో ఒత్తిడి తగ్గుతుందిలా..