రొమ్ములో నొప్పి.. మూత్రం లీకవుతోంది.. ఎందుకిలా?

డాక్టర్‌.. నా వయసు 38. నాకు ఇద్దరు పిల్లలు. రెండుసార్లూ సిజేరియనే అయింది. అయితే ఈ మధ్య కొన్ని నెలల నుంచి నాకు మూత్రం లీకవుతోంది. నెలసరి పూర్తవగానే వెజైనా దగ్గర దురద, మంటగా ఉంటోంది. కలయికలో పాల్గొన్నా ఇదే సమస్య. అలాగే ఎడమవైపు రొమ్ములో....

Published : 18 Mar 2023 21:21 IST

డాక్టర్‌.. నా వయసు 38. నాకు ఇద్దరు పిల్లలు. రెండుసార్లూ సిజేరియనే అయింది. అయితే ఈ మధ్య కొన్ని నెలల నుంచి నాకు మూత్రం లీకవుతోంది. నెలసరి పూర్తవగానే వెజైనా దగ్గర దురద, మంటగా ఉంటోంది. కలయికలో పాల్గొన్నా ఇదే సమస్య. అలాగే ఎడమవైపు రొమ్ములో కూడా నొప్పిగా ఉంటోంది. ఎందుకిలా జరుగుతుందో దయచేసి చెప్పండి. - ఓ సోదరి

జ: మీరు రాసిన వివరాలను బట్టి మీకు మూడు సమస్యలున్నాయి.

మొదటిది - మూత్రం లీకవడం. అయితే దీని గురించి ఇంకా కొన్ని వివరాలు అవసరమవుతాయి. అంటే.. మీకు బాత్రూమ్‌కి వెళ్లే వరకు ఆగకుండా త్వరగా లీకవుతోందా?, దగ్గినప్పుడు-తుమ్మినప్పుడు లీకవుతోందా?, దానంతటదే లీకవుతూనే ఉంటుందా? అనేది తెలుసుకోవడానికి పరీక్ష చేయాలి. అలాగే గర్భాశయం, దాంతో పాటు యూరినరీ బ్లాడర్‌ జారడం వంటి సమస్యలున్నాయేమో చూడాలి. యూరినరీ బ్లాడర్‌ కండరాలు బలహీన పడి.. లోపల మూత్రం నిల్వ ఉండిపోతోందేమో చూడాలి. ఇన్ని చేసినా సమస్య అర్థం కాకపోతే యూరో డైనమిక్స్‌ అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వీటన్నింటి రిపోర్టులు చూసిన తర్వాతే చికిత్స సూచించగలుగుతారు.

మీ రెండో సమస్య - వెజైనా దగ్గర దురద, మంట. ఇది సాధారణంగా ఇన్ఫెక్షన్‌ వల్ల వస్తుంది. అయితే ఎలాంటి ఇన్ఫెక్షనో తెలుసుకోవాలంటే మాత్రం పరీక్ష చేసి చూడాలి.

మూడో సమస్య - రొమ్ములో నొప్పి.. అంటే అది కూడా హార్మోన్ల ప్రభావం వల్ల కావచ్చు.. లేదా ఇన్ఫెక్షన్ల వల్ల కావచ్చు.. మీరు ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న గైనకాలజిస్ట్‌ దగ్గరికెళ్తే మీ లక్షణాలన్నీ తెలుసుకొని అవసరమైన పరీక్షలు సూచిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్