ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌.. జన్యుపరమైన సమస్యా?

హాయ్‌ మేడమ్. నా వయసు 15 ఏళ్లు. నాకు ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌ సమస్య ఉంది. దీంతో నెలసరి రాక సుమారు మూడు నెలలవుతోంది. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే హార్మోన్ల అసమతుల్యత అని చెప్పారు. రెండు నెలలు మందులు వాడమన్నారు.

Published : 07 Dec 2023 12:49 IST

హాయ్‌ మేడమ్. నా వయసు 15 ఏళ్లు. నాకు ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌ సమస్య ఉంది. దీంతో నెలసరి రాక సుమారు మూడు నెలలవుతోంది. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే హార్మోన్ల అసమతుల్యత అని చెప్పారు. రెండు నెలలు మందులు వాడమన్నారు. అయినా ఫలితం లేదు. ఈ సమస్య తగ్గాలంటే ఎన్నాళ్లు మందులు వాడాల్సి ఉంటుంది? నా వయసులో ఉన్నప్పుడు మా అమ్మ కూడా ఇదే సమస్యతో బాధపడిందట! జన్యుపరంగా ఈ సమస్య వచ్చే అవకాశాలున్నాయా? సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ: మీకు 15 ఏళ్లని రాశారు. కానీ మీరు పుష్పవతి అయి ఎన్ని సంవత్సరాలైందో రాయలేదు. ఎందుకంటే నెలసరి మొదలైన రెండు మూడు సంవత్సరాల వరకు పిరియడ్స్‌ సక్రమంగా నెలనెలకూ రాకపోవచ్చు. రుతుక్రమాన్ని నియంత్రించే హెచ్‌పీవో (హైపోథాలమిక్‌ పిట్యుటరీ ఒవేరియన్‌ యాక్సెస్‌) పరిణతి చెందడానికి సమయం పడుతుంది. ఒకవేళ మీకు నెలసరి మొదలై ఇప్పటికే మూడు నాలుగు సంవత్సరాలు గడిచిపోయి ఉంటే.. మీ అమ్మగారి లాగే జన్యుపరంగా సంక్రమించిన హార్మోన్ల అసమతుల్యత కావచ్చు. చాలావరకు ఇది పీసీఓఎస్‌ అయి ఉంటుంది. మీకు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, హార్మోన్ల పరీక్షలు చేయడం ద్వారా డాక్టర్లు దీనికి అసలు కారణమేంటో తెలుసుకోగలుగుతారు. ఇలాంటి సందర్భాల్లో హార్మోన్ల మాత్రలు కొన్ని సంవత్సరాల వరకు వాడాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్