వార్థక్యపు ఛాయలు లేకుండా..!

మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలు చర్మానికి చక్కని ప్రయోజనాలు చేకూరిస్తే.. మరికొన్ని మాత్రం హాని కలిగిస్తుంటాయి. ఫలితంగా చర్మం మీద సన్నని గీతలు.. ముడతలు ఏర్పడడం, పొడిబారిపోవడం, నిర్జీవంగా తయారవడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి....

Published : 29 Mar 2024 13:12 IST

మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలు చర్మానికి చక్కని ప్రయోజనాలు చేకూరిస్తే.. మరికొన్ని మాత్రం హాని కలిగిస్తుంటాయి. ఫలితంగా చర్మం మీద సన్నని గీతలు.. ముడతలు ఏర్పడడం, పొడిబారిపోవడం, నిర్జీవంగా తయారవడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. వాటి వల్ల చిన్నవయసులోనే వార్థక్యపు ఛాయలు సైతం కనిపిస్తుంటాయి. మరి, ఈ సమస్యలను దూరం పెడుతూ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాగే కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం రండి..

చక్కెరలు తగ్గించాలి..
బయట దొరికే జ్యూస్‌లు, మిల్క్‌షేక్స్.. వంటి చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, చర్మం ముడతలు పడటం.. వంటి సమస్యలు ఎదురవుతాయి. యవ్వనంలోనే వయసు పైబడిన ఛాయలు కనిపిస్తాయి. కాబట్టి బయట దొరికే వాటికి బదులు ఇంట్లోనే వీటిని ఆరోగ్యకరమైన రీతిలో తయారుచేసుకోవడం మంచిది.

పాల సంబంధిత ఉత్పత్తులు
పాలు, పాల సంబంధిత ఉత్పత్తుల నుంచి ప్రొటీన్లు బాగా అందుతాయి. కాబట్టి అవి ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ కొన్ని పాల సంబంధిత ఉత్పత్తులు మాత్రం చర్మ ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉందట. ముఖ్యంగా చీజ్, ఐస్‌క్రీమ్.. మొదలైనవి కొందరిలో మొటిమలు రావడానికి కారణమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వీటికి కూడా సాధ్యమైనంత మేరకు దూరంగా ఉండడం మంచిదన్నది నిపుణుల అభిప్రాయం.

వీటికి దూరంగా..
 డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, చిప్స్, జంక్‌ఫుడ్.. మొదలైన వాటికి పూర్తిగా దూరంగా ఉండడమే శేయస్కరం.
 క్యాన్డ్ లేదా ప్యాకేజ్డ్ ఫుడ్స్ జోలికి అస్సలు పోకూడదు. ఒకవేళ తప్పనిసరిగా అటువంటి పదార్థాలు తీసుకోవాల్సి వస్తే అందులో సోడియం స్థాయులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
 అలాగే ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. లేదంటే ముఖం ఉబ్బినట్లుగా కనిపించడం, కళ్ల కింద వాపు.. వంటి సమస్యలు తలెత్తుతాయి.
 చక్కెర, సోడా, వెజిటబుల్ ఆయిల్.. మొదలైన వాటికి కూడా దూరంగా ఉండాలి.
 శుభ్రమైన నీటినే తాగాలి. కుళాయి నుంచి వచ్చే నీటిని నేరుగా తాగకూడదు. ఎందుకంటే అందులో ఉండే క్లోరిన్, ఫ్లోరైడ్.. వంటి రసాయనాలు చర్మ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. కాబట్టి వాటిని బాగా మరిగించి, చల్లార్చుకొని తాగడం లేదా ప్యూరిఫయర్‌లోని నీటిని తాగడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్