లిప్‌లైనర్‌.. ఇలా కూడా!

పెదవుల అసమానతను సరిచేసి, అధరాల అందాన్ని రెట్టింపు చేసి.. అనుకున్న ఆకృతిలోకి తెస్తుంది లిప్‌లైనర్‌. అధరాలను వెడల్పుగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే లిప్‌లైనర్‌ మేకప్‌లో మరెన్నో రకాలుగా కూడా ఉపయోగపడుతుందంటున్నారు సౌందర్యనిపుణులు.

Published : 27 Jun 2022 06:13 IST

పెదవుల అసమానతను సరిచేసి, అధరాల అందాన్ని రెట్టింపు చేసి.. అనుకున్న ఆకృతిలోకి తెస్తుంది లిప్‌లైనర్‌. అధరాలను వెడల్పుగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే లిప్‌లైనర్‌ మేకప్‌లో మరెన్నో రకాలుగా కూడా ఉపయోగపడుతుందంటున్నారు సౌందర్యనిపుణులు.

ముందుగా పెదవులను శుభ్రం చేసుకొని టిష్యూ కాగితంతో మృదువుగా రుద్దితే.. మృతకణాలు దూరమవుతాయి. లిప్‌ బామ్‌ను అప్లై చేస్తే పొడారినట్లుగా ఉండే అధరాలు తేమగా మారతాయి. ముఖానికి అద్దిన ఫౌండేషన్‌లో బ్రష్‌ ముంచి రెండు పెదాల పైన ముందుగా కాస్తంత అద్దాలి. ఆ తర్వాత ముదురు గోధుమ, లేదా  ఎంచుకున్న లిప్‌స్టిక్‌ వర్ణానికి తగినట్లుగా లిప్‌లైనర్‌ పెన్సిల్‌ను తీసుకొని, కింద పెదవి బయటివైపు మూలల నుంచి లైనింగ్‌ మొదలుపెట్టి, అధరాల ఆకారాన్ని సరిచేస్తూ పైపెదవి వరకు గీయాలి. ఇలా చేస్తున్నప్పుడు అధరాలను నవ్వుతున్నట్లుగా ఉంచి గీస్తే పెదాల ఆకృతికి తగినట్లుగా లైనింగ్‌ వస్తుంది. అలాగే చేతి చిటికెనవేలిని గడ్డంపై బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఉంటే.. లిప్‌లైనర్‌తో పెదాలను అనుకున్న ఆకారంలో మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఆ తర్వాత పెదాల అంచుల్లో ఉన్న లైనింగ్‌ మధ్యలో మ్యాటే లిప్‌స్టిక్‌ వేసి, చివరిగా మరోసారి లిప్‌లైనర్‌తో పెదాల అంచులను దిద్దితే చాలు. అనుకున్న ఆకారంలో తాజాదనాన్ని నింపుకొన్నట్లుగా అధరాలు అందంగా మెరిసిపోతాయి. లేత గులాబీ, గోధుమ, అలాగే ఎరుపు, మెరూన్‌ వర్ణాల వంటి న్యూట్రల్‌ కలర్‌ లిప్‌లైనర్లు మేకప్‌బాక్సులో ఎప్పుడూ ఉండేలా జాగ్రత్తపడితే, ఎటువంటి వర్ణంలో లిప్‌స్టిక్‌ ఎంచుకున్నా కూడా ఇవి ఇట్టే సరిపోతాయి. అలాగే బోల్డ్‌ మ్యాటే లిప్‌లైనర్‌ పెదవుల అందాన్ని సహజసిద్ధంగా కనిపించేలా చేస్తే, 3డీ లిప్‌ లైనర్‌ ఉండీ ఉండనట్లుగా అధరాల ఆకృతిని కనిపించేలా చేస్తుంది. గ్లిమ్మర్‌లైనర్‌ రకం పెదాలను వర్ణభరితంగా మార్చేస్తుంది.

మరిన్నిరకాలుగా..

లిప్‌స్టిక్‌ బ్యాగులో లేనప్పుడు లిప్‌లైనర్‌తోనే పెదాలను అందంగా కనిపించేలా చేసుకోవచ్చు. లిప్‌బామ్‌ను పెదాలకు రాసి వాటిపై లిప్‌లైనర్‌ను లిప్‌స్టిక్‌లా మృదువుగా వేసినా చాలు. మెరిసే పెదాలు మీ సొంతమవుతాయి.
ముఖంపై బ్లష్‌లా లిప్‌లైనర్‌ను వినియోగించొచ్చు. చూపుడువేలు చివరిలో ముదురు వర్ణం లిప్‌లైనర్‌ పెన్సిల్‌ను రుద్ది, ఆ రంగును చెక్కిళ్లపై అద్ది మృదువుగా బ్రష్‌ చేస్తే చాలు. మేకప్‌ టచ్‌ కనిపిస్తుంది. 

ఐషాడోలా కూడా లిప్‌లైనర్‌నుపయోగించొచ్చు.  కనురెప్పలపైన దీన్ని నింపి, పైన ఫౌండేషన్‌ పౌడర్‌ను అద్దితే చాలు. వెడల్పైన నేత్రాలు మీ సొంతమవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్