వయసును దాచేద్దామా...

మనలో చాలా మందికి అసలు వయసు కంటే తక్కువగా కనిపించాలని ఉంటుంది. ఇది స్త్రీ సహజసిద్ధమైన కోరిక. కానీ అధిక శ్రమ, మానసిక ఒత్తిళ్లతో తక్కువ వయసు సంగతలా ఉంచి చర్మం ముడతలు బారి, కళ్లు లోతుకు పోయి అసలు కంటే పెద్దగా కనిపిస్తారు కొందరు. ఇలా జరక్కుండా ఉండాలంటే ఈ కూరలూ పండ్లూ తినండి.

Published : 06 Jul 2022 01:23 IST

మనలో చాలా మందికి అసలు వయసు కంటే తక్కువగా కనిపించాలని ఉంటుంది. ఇది స్త్రీ సహజసిద్ధమైన కోరిక. కానీ అధిక శ్రమ, మానసిక ఒత్తిళ్లతో తక్కువ వయసు సంగతలా ఉంచి చర్మం ముడతలు బారి, కళ్లు లోతుకు పోయి అసలు కంటే పెద్దగా కనిపిస్తారు కొందరు. ఇలా జరక్కుండా ఉండాలంటే ఈ కూరలూ పండ్లూ తినండి. ఎంచక్కా ప్రకటనల్లో అమ్మల్లా అందంగా, ఆకర్షణీయంగా కనిపించండి...

* ఆకుకూరలు.. ముఖ్యంగా బచ్చలి, చుక్క కూరల్లో క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్‌, భాస్వరం, ఎ,సి,కె, బి-1, బి-2 విటమిన్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, ముడతలు రావు.

* మామూలు ఆకుపచ్చటి క్యాప్సికంతో కూర చేసుకోవడం మనందరికీ అలవాటున్నా ఎర్ర క్యాప్సికంను పెద్దగా ఉపయోగించం. కానీ అందులో సి-విటమిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని ముడతలు పడనీయవు.

* బొప్పాయి సంపూర్ణ పోషకాహారం. ఇది చర్మం ముడతలు పడనీయదు, కంటి కింది చారలనూ తగ్గిస్తుంది.

* వంగ రంగులో నిగనిగలాడుతూ అందాలొలికిస్తాయి నేరేడుపళ్లు. వాటిల్లోని ఎ, సి- విటమిన్లు, ఆంథోసియానిన్‌ చర్మానికి నిగారింపు తెచ్చి ఆరోగ్యంగా ఉంచుతాయి.

* బ్రకోలిలో విస్తారంగా ఉన్న సి, కె-విటమిన్లు, పీచు, ఐరన్‌, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సురక్షితంగా ఉంచుతాయి.

* డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ప్రొటీన్లు గొప్ప శక్తినివ్వడమే కాదు, సూర్యతాపం వల్ల కలిగే చెడును నివారిస్తాయి. చర్మం ముడతలు పడకపోగా ప్రకాశిస్తుంది.

* అవకాడో, క్యారెట్లలో విటమిన్‌-ఎ అత్యధికంగా ఉంటుంది. ఇతర విటమిన్లు, ఖనిజాలూ కూడా ఉంటాయి. ఇవి టాక్సిన్స్‌ను నివారిస్తాయి. చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. కంటి కింద చారలేర్పడవు. స్కిన్‌ క్యాన్సర్‌ను కూడా నిరోధిస్తాయి.

* మనం రోజూ ఇలాంటివి తింటుంటే యాంటీ ఏజెనింగ్‌ క్రీములు అవసరం లేకుండానే వయసును ఇట్టే దాచేయవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్