ఓట్‌మీల్‌తో మెరిసిపోండిక...

చర్మానికి సహజంగా మెలనోసైట్స్‌ వర్ణానిస్తాయి. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే మెలనిన్‌ చర్మాన్ని సూర్యకిరణాల ప్రభావం పడకుండా కాపాడుతుంది. అయితే వీటి ఉత్పత్తి అవసరమైన దానికన్నా పెరిగితే పిగ్మంటేషన్‌ సమస్య మొదలవుతుంది.

Published : 20 Jul 2022 01:40 IST

చర్మానికి సహజంగా మెలనోసైట్స్‌ వర్ణానిస్తాయి. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే మెలనిన్‌ చర్మాన్ని సూర్యకిరణాల ప్రభావం పడకుండా కాపాడుతుంది. అయితే వీటి ఉత్పత్తి అవసరమైన దానికన్నా పెరిగితే పిగ్మంటేషన్‌ సమస్య మొదలవుతుంది. దీన్ని తగ్గించుకోవడమెలాగో చెబుతున్నారు నిపుణులు.

లేజర్‌ థెరపీ, కెమికల్‌ పీల్స్‌ వంటి పలురకాల చికిత్సల ద్వారా మెలనిన్‌ను తగ్గించొచ్చు. మూలికలు, యోగా, వాటర్‌ థెరపీ వంటి ఆయుర్వేద విధానాల ద్వారానూ అరికట్టొచ్చు.  సహజపద్ధతుల ద్వారా కూడా మెలనిన్‌ ఉత్పత్తి పెరగడాన్ని నియంత్రించొచ్చు అని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ తక్కువంటున్నారు. ఇందుకోసం ఓట్‌మీల్‌ పేస్ట్‌ను ముఖంపై పిగ్మంటేషన్‌ వచ్చిన చోట అప్లైచేసి 20 నిమిషాలు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో శుభ్రపరిస్తే ఫలితం కనిపిస్తుంది. ఇలా వారానికి మూడునాలుగు సార్లు చేయాలి. 

సోయా మిల్క్‌తో..

మెలనిన్‌ ఉత్పత్తిని సోయామిల్క్‌ అదుపులో ఉంచగలుగుతుంది. ముఖంపై పిగ్మంటేషన్‌ ఉన్న చోట ఈ మిల్క్‌లో ముంచిన దూదిని అద్ది, పావు గంట ఆరనిచ్చి కడగాలి. అయితే అన్‌ పాశ్చురైజ్డ్‌ మిల్క్‌ వినియోగించడం మంచిది. అలాగే మెత్తని టమాటా గుజ్జును లేపనంలా రాసి ఆరిన తర్వాత శుభ్రం చేయాలి. దీనిలోని యాంటీ ఏజింగ్‌ గుణాలతోపాటు విటమిన్లు, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ పిగ్మంటేషన్‌కు ఔషధంలా పనిచేస్తుంది. వారానికి కనీసం మూడు సార్లు ఇలా చేస్తే వీలైనంత త్వరగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

అవకాడోతో..

పీచు, విటమిన్‌ బి, సి, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్న అవకాడో గుజ్జును పిగ్మంటేషన్‌ మచ్చలున్న చోట రాసి ఆరనిచ్చి కడిగితే చాలు. ఇది వాటిని దూరం చేయడమే కాదు, చర్మాన్ని మెరిపిస్తుంది. నాలుగైదు చెంచాల పాలల్లో పావుచెంచా ఆర్గానిక్‌ పసుపు కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇందులోని కర్క్యుమిన్‌ మెలనిన్‌ ఉత్పత్తిని అదుపు చేస్తుంది. గ్రీన్‌టీ లేదా కాఫీ లేపనం కూడా ఈ సమస్యకు పరిష్కారాన్నిస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ గుణాలు ఫ్రీరాడికల్స్‌తో పోరాడి చర్మంపై మచ్చలను దూరం చేస్తాయి.

కలబంద గుజ్జుతో..

యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్‌ ఏ, సీ ఉన్న కలబంద గుజ్జు కూడా పిగ్మంటేషన్‌కు చెక్‌ చెప్పగలదు. అలాగే సిట్రిక్‌ యాసిడ్‌, సి విటమిన్‌ ఉండే నిమ్మరసాన్ని మచ్చలున్న చోట మాత్రం రాసి అయిదు నిమిషాల తర్వాత కడగాలి. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచి, మెలనిన్‌ను తగ్గించి చర్మాన్ని పూర్వపుస్థితికి తీసుకొస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే బంగాళాదుంపను మెత్తని పేస్ట్‌గా చేసి రాస్తే, చర్మంపై ఏర్పడిన పిగ్మంటేషన్‌ మచ్చలను పోగొట్టి, కొత్త మెరుపును అందిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్