ముఖానికి కొత్త కాంతి!

ఐస్‌క్యూబ్స్‌ ముఖాన్ని మెరిపిస్తాయి. ఆ క్యూబ్స్‌కి కొన్ని పోషకాలను జోడిస్తే.. చర్మఆరోగ్యమూ మెరుగుపడుతుంది...  చిక్కని కాఫీ డికాక్షన్‌ను ఐస్‌క్యూబ్స్‌ ట్రేలో

Published : 26 Jul 2022 02:42 IST

ఐస్‌క్యూబ్స్‌ ముఖాన్ని మెరిపిస్తాయి. ఆ క్యూబ్స్‌కి కొన్ని పోషకాలను జోడిస్తే.. చర్మఆరోగ్యమూ మెరుగుపడుతుంది... 

చిక్కని కాఫీ డికాక్షన్‌ను ఐస్‌క్యూబ్స్‌ ట్రేలో నింపి ఫ్రీజర్‌లో ఉంచి ప్రతిరోజు ఉదయం ఈ క్యూబ్‌తో ముఖాన్ని రుద్దాలి. ఆ తర్వాత మంచినీటితో కడిగితే రోజంతా ముఖం తాజాగా, కాంతిమంతంగా కనిపిస్తుంది. అలాగే గుప్పెడు కీరదోస ముక్కలను మిక్సీలో వేసి గుజ్జుగా చేసుకోవాలి. దీనికి రెండు చెంచాల నిమ్మరసాన్ని కలిపి క్యూబ్స్‌లో నింపి ఫ్రీజర్‌లో ఉంచితే చాలు. ఉదయాన్నే దీంతో ముఖాన్ని రుద్దితే మచ్చలు దూరమవుతాయి. ముఖచర్మం పొడిబారకుండానూ ఉంటుంది.
తులసితో.. గుప్పెడు తులసి ఆకులను మెత్తని ముద్దగా చేసి అందులో రెండు చెంచాల కలబంద గుజ్జు కలిపి ఐస్‌క్యూబ్స్‌ ట్రేలో నింపి ఫ్రీజర్‌లో ఉంచాలి. దీంతో రాత్రి నిద్రపోయే ముందు ముఖాన్ని రుద్దితే మచ్చలు దూరమవుతాయి. ఎండ వల్ల కమిలిన భాగమంతా శరీరఛాయలో కలిసిపోతుంది. ఇందులోని యాంటీబయాటిక్‌ గుణాలు మొటిమలు రాకుండా కాపాడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్