ఏబీసీ రోజూ తీసుకుంటా!

‘సీతారామం’ సినిమాతో తెలుగునాట పరిచయమైంది మృణాల్‌ ఠాకూర్‌. అచ్చ తెలుగమ్మాయిలా కనిపించే ఈ మరాఠీ అమ్మాయి తన అందానికి.. ‘విటమిన్‌ సికి అధిక ప్రాధాన్యమిస్తా. ఆహారంగానైనా తీసుకుంటా లేదూ పైపూతగానైనా రాస్తా. నా ఉదయమూ గోరువెచ్చని నీటిలో కలిపిన నిమ్మరసంతోనే ప్రారంభమవుతుంది. షూటింగ్‌ అంటేనే దుమ్మూ, ధూళి, రాత్రి, పగలు తేడా లేకుండా పని చేయాలి.

Published : 24 Sep 2022 00:40 IST

‘సీతారామం’ సినిమాతో తెలుగునాట పరిచయమైంది మృణాల్‌ ఠాకూర్‌. అచ్చ తెలుగమ్మాయిలా కనిపించే ఈ మరాఠీ అమ్మాయి తన అందానికి.. ‘విటమిన్‌ సికి అధిక ప్రాధాన్యమిస్తా. ఆహారంగానైనా తీసుకుంటా లేదూ పైపూతగానైనా రాస్తా. నా ఉదయమూ గోరువెచ్చని నీటిలో కలిపిన నిమ్మరసంతోనే ప్రారంభమవుతుంది. షూటింగ్‌ అంటేనే దుమ్మూ, ధూళి, రాత్రి, పగలు తేడా లేకుండా పని చేయాలి. ఉత్సాహంగా ఉండటానికని కాఫీ ఎక్కువగా తీసుకుంటా. వీటన్నింటితో చర్మం తేమ కోల్పోతుంది. అందుకే విటమిన్‌ సికి అంత ప్రాధాన్యం. తర్వాత ఏబీసీ.. యాపిల్‌, బీట్‌రూట్‌, క్యారెట్‌ కలిపిన జ్యూస్‌ రోజూ తాగుతా. ఆహారంలోనూ పండ్లు తప్పక ఉండాల్సిందే. ముఖం కడిగిన ప్రతిసారీ మాయిశ్చరైజర్‌, ఎస్‌పీఎఫ్‌ 50 ఉన్న సన్‌స్క్రీన్‌ రాస్తా. షూటింగ్‌ పూర్తయ్యాక మేకప్‌ తొలగించాక, సీరమ్‌ మాస్క్‌ వేసి, ఆపై మాయిశ్చరైజర్‌ రాశాకే నిద్రపోతా. షూటింగ్‌ నుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా అలోవెరా, టొమాటో లేదా ఏదైనా పండు గుజ్జును 20నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి ముఖానికి రాస్తా. జుట్టుకు కొబ్బరినూనె పట్టిస్తా. చర్మం సహజ మెరుపుకు వ్యాయామమూ కారణమని నమ్ముతా అందుకే తాడాట, యోగా, పరుగు.. ఇలా నచ్చినదాన్ని చేస్తుంటా. ఎప్పుడూ నీళ్లసీసా పక్కన పెట్టుకొని మరీ గుర్తుంచుకొని తాగుతా. ఇదే నా రహస్య’మని చెప్పుకొచ్చింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్