దుస్తులెన్ని ఉన్నా...

మాన్వికి ఆఫీస్‌కెళ్లే ముందు వార్డ్‌రోబ్‌ దగ్గరే ఎక్కువగా సమయం వృథా అవుతుంది. దుస్తుల ఎంపికలో ఆలస్యంతో పాటు డ్రస్‌కు మ్యాచింగ్‌ దుపట్టా, లెగ్గింగ్స్‌, ప్యాంటు, బ్లేజర్‌వంటివి దొరకడం దుర్లభం. వార్డ్‌రోబ్‌ను ఓ ప్రణాళికతో సర్దితే ఈ సమస్యను నివారించొచ్చు అంటున్నారు నిపుణులు.

Published : 25 Sep 2022 02:22 IST

మాన్వికి ఆఫీస్‌కెళ్లే ముందు వార్డ్‌రోబ్‌ దగ్గరే ఎక్కువగా సమయం వృథా అవుతుంది. దుస్తుల ఎంపికలో ఆలస్యంతో పాటు డ్రస్‌కు మ్యాచింగ్‌ దుపట్టా, లెగ్గింగ్స్‌, ప్యాంటు, బ్లేజర్‌వంటివి దొరకడం దుర్లభం. వార్డ్‌రోబ్‌ను ఓ ప్రణాళికతో సర్దితే ఈ సమస్యను నివారించొచ్చు అంటున్నారు నిపుణులు.

షాపింగ్‌కెళ్లినప్పుడు నచ్చినవన్నీ కొనేయడం పొరపాటు. దీంతో వార్డ్‌రోబ్‌ నిండి పోవడం తప్ప, అందులో కావాల్సినప్పుడు సరైన మ్యాచింగ్‌ దొరకడం కష్టమవుతుంది. దుస్తులను ఎంచుకునేటప్పుడు వాటిపైకి కావాల్సినవీ అప్పుడే తీసుకోవడం మంచిది. ఏ దుస్తులకు జతలు కావాలో ముందే రాసుకుని తీసుకెళితే మరిచిపోమిక. ముందు అవి కొనడం మీదే మనసు పెట్టాలి. అప్పుడు అనవసర కొనుగోళ్లూ ఉండవు.

సర్దాలి..

వార్డ్‌రోబ్‌ను సర్దడానికి రెండువారాలకొకసారి సమయాన్ని కేటాయించుకోవాలి. ఏయే దుస్తులను సెట్‌గా ధరిస్తామో వాటన్నింటినీ ఒక అరలో ప్రత్యేకంగా ఉంచాలి. అప్పుడు సమయం వృథా అవదు. అలాగే జీన్స్‌, కాటన్‌, టెరీకాటన్‌ ప్యాంటులన్నీ ఒకేచోట సర్దాలి. అలాగే షర్ట్‌లు, షార్ట్‌ టాప్స్‌ హ్యాంగర్స్‌కు తగిలిస్తే తేలికగా తీసుకోవచ్చు. మ్యాచింగ్‌కు కావాల్సినప్పుడు కంటికెదురుగా కనిపించేలా ఉంటాయి. లెగ్గింగ్స్‌ను ఒకేఅరలో వరుసగా సర్ది చూడండి. కావాల్సిన రంగును క్షణాల్లో తీసుకోవచ్చు. ఫ్లోర్‌లెంత్‌ గౌన్లను లాంగ్‌ హ్యాంగర్లకు తగిలిస్తే... ముడతలు పడవు, ఎంచుకోవడానికి తేలిగ్గా ఉంటుంది.

దుపట్టాలకు ఇప్పుడు ప్రత్యేకంగా హ్యాంగర్స్‌ లభ్యమవుతున్నాయి. రింగ్స్‌ మోడల్‌లో ఉండే వీటికి దుపట్టాలను ముడివేస్తే చాలు. వీటిని వార్డ్‌రోబ్‌ డోర్‌లో అమర్చుకోవచ్చు. వీటితోపాటు ఇన్నర్‌వేర్స్‌కు ప్రత్యేకంగా ఒక అట్టపెట్టె వార్డ్‌రోబ్‌లో ఒక మూల ఉంచి, అందులో సర్దుకుంటే సరి. మిగతా దుస్తులతో కలిసి పోకుండా ఉంటాయి. ఇలా ప్రణాళికగా సర్దితే వార్డ్‌రోబ్‌ నిండినట్లు అనిపించదు. అవసరమైన వాటిని నిమిషాల్లో ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. సర్దే ప్రతిసారీ వృథా, వినియోగించనివి తీసి ఒక అట్టపెట్టెలో ప్యాక్‌ చేయాలి. వీటిని ఏ అనాథాశ్రమాలకో ఇస్తే మంచిది. బీరువా ఇరుకూ తప్పుతుంది... అవసరం ఉన్న వారికి ఉపయోగమూ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్