అప్పటికప్పుడు అందంగా..

అనుకోకుండా వచ్చే ఆహ్వానాన్ని కాదనలేం. అయితే అప్పటివరకు ఇంట్లో లేదా ఆఫీస్‌లో పనిచేసిన అలసట ముఖంలో కనబడుతూ ఉంటుంది. అయినా..  ముఖాన్ని కొద్ది సేపట్లోనే కళగా మార్చుకొని

Updated : 29 Sep 2022 03:50 IST

అనుకోకుండా వచ్చే ఆహ్వానాన్ని కాదనలేం. అయితే అప్పటివరకు ఇంట్లో లేదా ఆఫీస్‌లో పనిచేసిన అలసట ముఖంలో కనబడుతూ ఉంటుంది. అయినా.. ముఖాన్ని కొద్ది సేపట్లోనే కళగా మార్చుకొని అందంగా కనిపించొచ్చు అంటున్నారు నిపుణులు.

ముఖంపై సూర్యరశ్మివల్ల ఏర్పడిన మచ్చలు పోవాలన్నా, శరీర ఛాయ ఒకేతీరుగా కనిపించాలన్నా బ్లీచింగ్‌ అవసరం. పార్లర్‌లో రసాయనాలతో చేయించుకుంటే తాత్కాలిక మెరుపు రావొచ్చు, అయితే దీంతో అలర్జీలు తదితర దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది. అలాకాకుండా సహజ బ్లీచింగ్‌ ఏజెంట్‌గా పనిచేసే పెరుగుతో ఇంట్లోనే ముఖాన్ని మెరుపులీనేలా చేసుకోవచ్చు. ఇందులోని లాక్టిక్‌యాసిడ్‌ చర్మంపై మచ్చలను దూరం చేసి కాంతిగా మారుస్తుంది.

* రెండు చెంచాల పెరుగులో చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించి ఆరాక కడగాలి. ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేసి, చర్మాన్ని మృదువుగా, తేమగా మారుస్తుంది.

* జిడ్డు చర్మానికి పెరుగుకు బదులుగా పాలను వాడితే మంచిది.

* చెంచా పెరుగులో చెంచా నిమ్మరసం, అరచెంచా పసుపు కలిపిన మిశ్రమాన్ని చేతులు, మెడకు రాసి పదినిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే చర్మం మెరుపులీనుతుంది.

మెరిసేలా... 10 బాదంపప్పులకు రెండు చెంచాల ఓట్స్‌ కలిపి పొడి చేసి సీసాలో భద్రపరుచుకోవాలి. అత్యవసరంగా స్క్రబ్‌ చేసుకోవాలి అన్నప్పుడు చెంచా పొడికి గులాబీ నీటిని కలిపి ముఖానికి పట్టించి తడిపొడిగా ఉన్నప్పుడే అయిదునిమిషాలు మృదువుగా రుద్ది కడిగితే చర్మ రంధ్రాల్లో మురికి పోతుంది. ఇలా తెరుచుకున్న చర్మరంధ్రాలు మూసుకోవడానికి ఐస్‌వాటర్‌తో మరోసారి ముఖాన్ని కడగాలి. ఇలా చేస్తే చర్మం బిగుతుగానూ అవుతుంది. రక్తప్రసరణ సజావుగా జరిగి ముఖం కాంతులీనుతుంది. చివరగా రెండు గులాబీ రేకలను మెత్తగా చేసి ఒక గిన్నెలో వేసి గ్లాసు నీళ్లు, మూడునాలుగు ఐస్‌క్యూబ్స్‌ వేయాలి. ఈ నీటిలో మెత్తని వస్త్రాన్ని తడిపి ముఖంపై వేసి అయిదు నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత అదే వస్త్రంతో ముఖాన్ని తుడిస్తే చాలు. చర్మం తాజాగా, మెరుపును సంతరించుకుంటుంది. ఆ తర్వాత ప్రైమర్‌ వేసి లైట్‌గా మేకప్‌ వేసినా చాలు... ఆకర్షణీయంగా కనిపించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్