పండగ రోజుల్లో ప్రత్యేకంగా..

నూతన వస్త్రాలు, ఆభరణాలతోపాటు మేకప్‌ వేస్తే చాలు.. పండగ కళ వచ్చేసింది అనుకోకూడదు. శిరోజాలు కూడా పట్టులా మెరవాలి. అనుకున్న రీతిలో తీర్చిదిద్దడానికి వీలుగా ఉండాలి. దీనికోసం ఈ పండగల రోజుల్లో శిరోజాల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన పోషకాలపై నిపుణుల సూచనలివి.

Published : 03 Oct 2022 00:57 IST

నూతన వస్త్రాలు, ఆభరణాలతోపాటు మేకప్‌ వేస్తే చాలు.. పండగ కళ వచ్చేసింది అనుకోకూడదు. శిరోజాలు కూడా పట్టులా మెరవాలి. అనుకున్న రీతిలో తీర్చిదిద్దడానికి వీలుగా ఉండాలి. దీనికోసం ఈ పండగల రోజుల్లో శిరోజాల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన పోషకాలపై నిపుణుల సూచనలివి.

శిరోజాలు రాలడం, చుండ్రు, దురద వంటి సమస్యలు జుట్టును పేలవంగా కనిపించేలా చేస్తాయి. కుదుళ్ల అనారోగ్యానికి ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్‌ తక్కువగా అందడమే దీనికి కారణం. మాడు పొడారి, శిరోజాలకు రక్తప్రసరణ జరగదు. దీంతో జుట్టు కళావిహీనంగా మారుతుంది. మాడుపై చర్మకణాల ఉత్పత్తి, హార్మోన్ల సమన్వయం, ఆహారంద్వారా పలురకాల విటమిన్లు రక్తంద్వారా శిరోజాలకు అందడంలో జింక్‌ దోహదపడుతుంది. జుట్టు ఎదుగుదలకు తోడ్పడే జింక్‌ లోపం శిరోజాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

* అలాగే సి విటమిన్‌ ఉంటేనే శరీరం ఇనుమును తీసుకోగలగుతుంది. నారింజ, నిమ్మ, బత్తాయి వంటి పండ్లను ఎక్కువగా తీసుకుంటూ శిరోజాలకు కావాల్సిన ఇనుమును అందేలా చూడాలి.  కొల్లాజిన్‌ ఉత్పత్తికి సి విటమిన్‌ తోడ్పడటమే కాదు, కావాల్సిన పోషకాలను అందేలా చేసి జుట్టు పెరగడానికి సాయపడుతుంది. చిలకడదుంప, నారింజ వర్ణంలో ఉండే క్యారెట్‌, గుమ్మడికాయ.. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ఆహారంలోని జుట్టుకు కావాల్సిన ఏ విటమిన్‌ను అందేలా చేస్తాయి. మాడుపై గ్రంధులకు అవసరమయ్యే సీబం ఉత్పత్తిలోనూ తోడ్పడి పొడారే సమస్య లేకుండా కాపాడతాయి. 

* శిరోజాల ఆరోగ్యంలో ప్రధానపాత్రవహించే ప్రొటీన్లు, మంచి కొవ్వు, విటమిన్లు వంటివి ఆల్మండ్‌ బటర్‌లో పుష్కలంగా ఉంటాయి. బాదంలోని విటమిన్‌ ఈ వల్ల నల్లని నిగనిగలాడే ఒత్తైన జుట్టు సొంతమవుతుంది. టేబుల్‌స్పూన్‌ ఆల్మండ్‌ బటర్‌లో ఉండే 3.87 మిల్లీగ్రాముల ఈ విటమిన్‌ శిరోజాలను పరిరక్షిస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో బటర్‌ ఉండేలా చూసుకోవాలి. ఎండుఫలాలు, బాదం, అక్రోట్‌, జీడిపప్పువంటివాటిలో ఇనుము, సల్ఫర్‌, జింక్‌, బయోటిన్‌సహా విటమిన్‌ ఈ ఉంటుంది. ఇవన్నీ మాడుపై రక్తప్రసరణను మెరుగుపరిచి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటన్నింటితోపాటు పెరుగుద్వారా ప్రొటీన్లు, విటమిన్‌ బీ5 అందుతుంది. మాడుపై రక్తప్రసరణను మెరుగుపరిచి, జుట్టు పెరగడానికి దోహదపడేలా చేస్తాయివి. జుట్టు ఎదుగుదలకు తోడ్పడే జింక్‌ లోపం శిరోజాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్