చివరి నిమిషంలోనూ మెరవొచ్చు

పండగవేళ అందంగా కనిపించాలని కోరుకోని అమ్మాయుండదు. ఉద్యోగం, వ్యాపారాలతో తీరిక లేనివారికి ముందు నుంచీ సన్నద్ధమవడం సాధ్యం కాకపోవచ్చు. అయినా నిరుత్సాహపడొద్దు. అలాంటప్పుడు నిమిషాల్లో మెరిసిపోవడానికి ఈ ప్యాక్‌లు ప్రయత్నించేయండి.

Published : 24 Oct 2022 00:43 IST

పండగవేళ అందంగా కనిపించాలని కోరుకోని అమ్మాయుండదు. ఉద్యోగం, వ్యాపారాలతో తీరిక లేనివారికి ముందు నుంచీ సన్నద్ధమవడం సాధ్యం కాకపోవచ్చు. అయినా నిరుత్సాహపడొద్దు. అలాంటప్పుడు నిమిషాల్లో మెరిసిపోవడానికి ఈ ప్యాక్‌లు ప్రయత్నించేయండి.

అరటిపండు గుజ్జుకు కాస్త తేనె, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకి పట్టించండి. పావుగంటయ్యాక చేతిని కాస్త తడి చేసుకుంటూ రుద్ది, చల్లటి నీటితో కడిగేస్తే సరి. మృత కణాలు తొలగడమే కాదు.. చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

పావుకప్పు కలబంద గుజ్జుకు స్పూను బాదం నూనె కలిపి ముఖానికి, మెడకి రాయాలి. వీటిల్లోని విటమిన్‌  -ఇ చర్మాన్ని ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. పావుగంట ఉంచుకొని కడిగేసుకుంటే చర్మానికి కావాల్సిన తేమా అందుతుంది.

చిన్న బొప్పాయి ముక్క రెండు స్పూన్ల ఓట్స్‌, స్పూను పంచదార, కాస్త తేనె కలిపి మెత్తగా మిక్సీ పట్టాలి. ముఖానికి, మెడకి పట్టించి అయిదు నిమిషాలు మర్దనా చేసి, కాసేపు వదిలేయాలి. తర్వాత వృత్తాకారంలో రుద్దుతూ కడిగేస్తే సరి.

ముల్తానీ మట్టికి కొన్ని పుదీనా ఆకులు, కొంచెం పెరుగు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని ముఖానికి రాసుకొని ఆరాక కడిగేయండి. దద్దుర్లు, యాక్నే వంటివి ఉంటే చిన్నగా అవుతాయి. ముఖమూ కాంతిమంతమవుతుంది. తరచూ రాస్తోంటే మొటిమల తాలూకు మచ్చలూ తగ్గుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్