కళ్లకీ క్రీమ్‌ కావాలా?

స్కిన్‌ కేర్‌ రొటీన్‌, చర్మ ఆరోగ్యం అంటూ టోనర్‌, సీరమ్‌, మాయిశ్చరైజర్‌, ఫేస్‌ ఆయిల్స్‌.. ఇలా బోలెడు వాడుతుంటాం. ఇవన్నీ చర్మాన్ని సంరక్షించేవే! ప్రత్యేకంగా కళ్లకీ క్రీములూ రాయాలా అంటే రాయాల్సిందే అంటున్నారు నిపుణులు.

Updated : 27 Oct 2022 13:31 IST

స్కిన్‌ కేర్‌ రొటీన్‌, చర్మ ఆరోగ్యం అంటూ టోనర్‌, సీరమ్‌, మాయిశ్చరైజర్‌, ఫేస్‌ ఆయిల్స్‌.. ఇలా బోలెడు వాడుతుంటాం. ఇవన్నీ చర్మాన్ని సంరక్షించేవే! ప్రత్యేకంగా కళ్లకీ క్రీములూ రాయాలా అంటే రాయాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే..

* వృద్ధాప్య ఛాయలంటూ మనం కంగారు పడతామే.. అవి మొదట కనిపించేది కళ్ల పక్కనే! ఎందుకంటే కళ్ల చుట్టూ ఉండే చర్మం పలుచగా, సున్నితంగా ఉంటుంది. ముఖంలోని ఇతర భాగాలతో పోలిస్తే దీనికి ఎక్కువ తేమ అవసరం. అది మామూలు మాయిశ్చరైజర్‌ తీర్చలేదు. అందుకని ఐ క్రీమ్‌ తప్పనిసరి.

* పాతికేళ్లు వచ్చినప్పటి నుంచే చర్మంలో కొల్లాజెన్‌ తగ్గడం మొదలవుతుంది. దీనికి వాతావరణ కాలుష్యమూ, ఎక్కువగా ఎండలో తిరగడం వంటివి కారణమవుతాయి. ఇరవైల్లోకి అడుగు పెట్టినవాళ్లకి వీటి అవసరం లేదు కానీ, పాతికేళ్లు వచ్చినప్పటి నుంచీ వీటిని ఉపయోగించడం ప్రారంభిస్తే ఈ గీతలు, ముడతలను కొంతవరకు నివారించవచ్చు.

* కళ్ల కింద ఉబ్బడం, నల్లటి వలయాలు.. వీటికి చెక్‌ పెట్టాలన్నా ఐ క్రీమ్‌లను వాడాలట. అయితే అన్నింటికీ ఒకే మంత్రం పనికి రాదంటున్నారు నిపుణులు. ముడతలు వంటివి కనిపిస్తోంటే రెటినాల్‌, పెప్టైడ్స్‌ ఉన్నవాటిని ఎంచుకోవాలి. కళ్లకింద నల్లటి వలయాలుంటే విటమిన్‌ సి, కె ఉన్నవి తీసుకోవాలి. కళ్ల కింద ఉబ్బుగా ఉంటే విటమిన్‌ ఎ, సెరామైడ్స్‌ వంటివి పనిచేస్తాయి.

* మిగతా చర్మంతో పోలిస్తే కళ్లచుట్టూ ఉన్నదానికి ప్రత్యేక సంరక్షణ కావాలి. ఆ అవసరాలను ఐ క్రీమ్‌లు తీర్చగలవు. ముఖంపై మార్పులను గమనించుకుంటూ ఉండండి. సంరక్షణ అవసరం అనిపిస్తే వీటిని ఉపయోగించడం ప్రారంభించండి. ముఖ అందంలో కళ్లది ప్రధాన పాత్ర మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్