శిరోజాలకు దివ్యౌషధం..

జింక్‌, సల్ఫర్‌, ఫోలిక్‌యాసిడ్‌, బి విటమిన్‌, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఉల్లిరసంతో ఒత్తైన జుట్టు సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

Published : 28 Oct 2022 00:34 IST

జింక్‌, సల్ఫర్‌, ఫోలిక్‌యాసిడ్‌, బి విటమిన్‌, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఉల్లిరసంతో ఒత్తైన జుట్టు సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

అల్లం కలిపితే.. రెండు పెద్ద ఉల్లిపాయలను తరిగి మిక్సీ పట్టి ఉల్లిరసాన్ని సిద్ధం చేసుకోవాలి. అల్లం రసాన్ని విడిగా తీయాలి. ఈ రెంటినీ సమపాళ్లలో కలిపి, మాడుకు రాసి మర్దనా చేయాలి. గంట ఆరనిచ్చి రసాయనాల్లేని షాంపూతో తల స్నానం చేసి, కండిషనర్‌ అప్లై చేయాలి. వారానికి 2, 3 సార్లు ఇలా చేేస్తే ఉల్లిలోని పోషకాలు జుట్టును ఆరోగ్యంగా మెరిసేలా చేస్తే, అల్లం రసం కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. చుండ్రూ దూరమవుతుంది.

పెరుగుతో.. 6 చెంచాల ఉల్లి రసానికి రెండు చెంచాల పెరుగు కలిపి మాడు నుంచి శిరోజాల చివర్ల వరకు రాసి 40 నిమిషాలు ఆరనిచ్చి తలస్నానం చేయాలి. వారానికొకసారి ఇలా చేస్తే చుండ్రు వంటి సమస్యలను దూరమవుతాయి. మంచి కండిషనర్‌గానూ పనిచేసి శిరోజాలను మృదువుగా ఉంచుతుంది. పీహెచ్‌ స్థాయులను సమన్వయం చేస్తుంది. సెబమ్‌ స్థాయిని నియంత్రించి మాడును ఆరోగ్యంగా మారుస్తుంది.

ఆముదం కలిపి... నాలుగైదు చెంచాల ఉల్లి రసానికి రెండు చెంచాల ఆముదాన్ని కలిపి మాడుకు మృదువుగా రాసి మర్దనా చేయాలి. రెండు గంటల తర్వాత షాంపూతో తల స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇందులోని రిసినోలిక్‌ యాసిడ్‌, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌ సహా ఉల్లిలోని పోషకాలు మాడుపై రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. పీహెచ్‌ స్థాయులను సమన్వయం చేస్తాయి. శిరోజాలు ఒత్తుగా పెరుగుతుంది.

గుడ్డుతో.. ఒక గుడ్డును గిన్నెలో కొట్టి, నాలుగైదు చెంచాల ఉల్లి రసం, 3 చుక్కల టీ-ట్రీ లేదా లావెండర్‌ ఎస్సెన్షియల్‌ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంటాగి తల స్నానం చేయాలి. ఈ లేపనంతో జుట్టుకు పోషకాలు అందుతాయి. శిరోజాల వేర్లను బలంగా ఉంచి రాలడాన్ని అరికడతాయి. మృదువుగా, మెరిసే శిరోజాలు సొంతమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్