బరువు తగ్గించే పియర్‌!

చర్మం, కురుల ఆరోగ్యానికి విటమిన్‌ ఎ తప్పనిసరి. ఇది ఈ పండులో సమృద్ధిగా లభిస్తుంది. దీనిలోని జీక్సాంథిన్‌, లుటిన్‌ ముడతలు, మచ్చలను దూరంచేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

Published : 29 Oct 2022 01:11 IST

* చర్మం, కురుల ఆరోగ్యానికి విటమిన్‌ ఎ తప్పనిసరి. ఇది ఈ పండులో సమృద్ధిగా లభిస్తుంది. దీనిలోని జీక్సాంథిన్‌, లుటిన్‌ ముడతలు, మచ్చలను దూరంచేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. కాపర్‌, కాల్షియం, ఫాస్ఫరస్‌, మాంగనీస్‌, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి సాయపడతాయి. ఆస్టియోపోరోసిస్‌ ఉన్న వారు దీన్ని రోజూ తీసుకుంటే సమస్య నుంచి త్వరగా బయట పడొచ్చు.

* వేగంగా బరువు తగ్గాలా? రోజువారీ ఆహారంలో పియర్‌ని చేర్చుకోమంటున్నారు నిపుణులు. దీనిలో పీచు ఎక్కువ. తిన్నాక చాలాసేపు ఆకలనిపించదు. కెలోరీలూ తక్కువే. పండులో నీటిశాతం ఎక్కువుండటంతో జీర్ణక్రియను మెరుగుపరచి బరువు తగ్గడంలో సాయపడుతుంది.

* దీనిలోని గుణాలు మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. విటమిన్‌ సి, కె ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. మధుమేహం, గుండెజబ్బులనూ దరి చేరనివ్వవు. ఐరన్‌, కాపర్‌ గుణాలెక్కువ. తరచూ తీసుకుంటే అనీమియాను రానివ్వదు. తరచూ నీరసపడుతున్నా, అలసిపోతున్నా దీన్ని రోజూ తీసుకోండి. ఫలితం త్వరగా కనిపిస్తుంది.

* విటమిన్‌ సి, ఎలు గాయాలను త్వరగా మాన్పడమే కాదు.. రోగనిరోధకతనూ పెంచుతాయి. పిల్లల్లో తరచూ జలుబు, అరుగుదల లేకపోవడం వంటివి కనిపిస్తే ఈ పండుని ఇవ్వండి. సమస్యలు దూరమవుతాయి. దీనిలోని ఫ్లావనాయిడ్లు, సినమిక్‌ ఆసిడ్లు క్యాన్సర్‌ని దరి చేరనివ్వవు. యాంథోసియానిన్‌ టైప్‌2 మధుమేహాన్ని అడ్డుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్