పట్టులాంటి జుట్టుకి గంజి!

వాతావరణం మారింది. ఈ కాలంలో జుట్టు తర్వగా నిర్జీవంగా కనిపిస్తుంది. కురులకు తగిన తేమ అంది పట్టు కుచ్చులా మెరవాలంటే గంజి వాడాల్సిందే. అదెలాగంటారా?

Published : 31 Oct 2022 00:15 IST

వాతావరణం మారింది. ఈ కాలంలో జుట్టు తర్వగా నిర్జీవంగా కనిపిస్తుంది. కురులకు తగిన తేమ అంది పట్టు కుచ్చులా మెరవాలంటే గంజి వాడాల్సిందే. అదెలాగంటారా?

* గంజిలో బి, ఇ, సి విటమిన్లు ఉంటాయి. ఇవి వెంట్రుకలకు పోషణనిచ్చి ఆరోగ్యంగా మారుస్తాయి. కప్పు గంజి, చెంచా నిమ్మరసం, ఓ గుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టి తలకు రాయాలి. ఆపై గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోండి. ఈ మిశ్రమం కుదుళ్లను బలంగా మారుస్తుంది.

* తరచూ బయట తిరిగే వారి జుట్టు కాలుష్య ప్రభావానికి గురి కాకుండా ఉండాలంటే గంజికి కాస్త మజ్జిగ కలిపి తలకు పట్టించి అరగంట ఆరనివ్వండి. ఆపై తక్కువ గాఢత గల షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే కుదుళ్లు బలపడతాయి. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు... జుట్టుకి పోషణ అందించి నిగారింపుతో కనిపించేలా చేస్తాయి.

* చలి గాలులకు జుట్టు బిరుసుగా మారుతుంది. అలాంటప్పుడు కప్పు గంజిలో కాస్త నిమ్మరసం, చెంచా పెరుగు కలిపి రాయండి. వీటిలోని పోషకాలు పోషణ అందించి వెంట్రుకల్ని మెరిపిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్