పండ్లతో మెరిసిపోండి!

చలి మొదలైంది. చల్లగాలులకు ముఖం కాంతిని కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది. తిరిగి కళకళలాడాలా? స్పూను చొప్పున నారింజ తొక్కల పొడి, ఓట్స్‌ను తీసుకోండి. దానికి చెంచా తేనె, తగినంత నీటిని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ముఖానికి పట్టించి, అయిదు నిమిషాలు మృదువుగా రుద్ది, గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరి.

Updated : 01 Nov 2022 01:02 IST

చలి మొదలైంది. చల్లగాలులకు ముఖం కాంతిని కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది. తిరిగి కళకళలాడాలా?

స్పూను చొప్పున నారింజ తొక్కల పొడి, ఓట్స్‌ను తీసుకోండి. దానికి చెంచా తేనె, తగినంత నీటిని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ముఖానికి పట్టించి, అయిదు నిమిషాలు మృదువుగా రుద్ది, గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరి. ఓట్స్‌ మృతకణాలను పోగొడితే, నారింజ చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది. తేనె చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది.

బాగా పండిన అరటి పండు సగం ముక్కను మెత్తగా చేయండి. దానికి చక్కెర, తేనె కలిపి ముఖానికి అయిదు నిమిషాలు వృత్తాకారంలో రుద్ది చల్లటి నీటితో కడిగేయండి. అరటిలో ఎక్కువగా దొరికే విటమిన్‌ ఎ చర్మాన్ని మృదువుగా చేయడమే కాదు.. శరీర ఛాయల్లో పొడలనీ సరిచేస్తుంది. దీన్లోని పోషకాలు కొల్లాజెన్‌ ఉత్పత్తికి సాయపడటమే కాదు వృద్ధాప్య ఛాయల్నీ దరిచేరనివ్వవు.

పండిన బొప్పాయి చిన్న ముక్కను బాగా మెదపాలి. దానికి స్పూను పెరుగు, అయిదు చుక్కల నిమ్మరసం కలిపి అయిదు నిమిషాలు ముఖానికి రుద్దండి. ఆపై చల్లని నీటితో కడిగేయాలి. పెరుగు చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. యాక్నేను దూరంగా ఉంచుతుంది. బొప్పాయి తేమనిస్తుంది. ట్యాన్‌నీ దరిచేరనివ్వదు. చర్మాన్నీ మృదువుగా మారుస్తుంది. నిమ్మ కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచి, మచ్చలను తగ్గించడంలో సాయ పడుతుంది.

స్క్రబ్‌కు ముందు ముఖాన్ని మైల్డ్‌ క్లెన్సర్‌తో శుభ్రం చేయాలి. చర్మం కాస్త తడిగా ఉన్నప్పుడే స్క్రబ్‌ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి, వృత్తాకారంలో రుద్ది కడగాలి. అవసరమైతే మధ్యమధ్యలో నీటితో తడి చేసుకోవచ్చు. కడిగేశాక మాయిశ్చరైజర్‌ రాయడం మర్చిపోవద్దు. వీటిని సాయంత్రం వేళల్లో ప్రయత్నించడం మేలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్