అందానికే వన్నె తెచ్చే చిట్కాలివి...

సహజ పీలింగ్‌ ఏజెంట్‌గా పని చేస్తుంది బొప్పాయి. అందుకే మొటిమలూ, వాటి తాలూకు మచ్చలు ఉన్నప్పుడు... బొప్పాయి గుజ్జులో కాస్త టొమాటో రసం, చెంచా ముల్తానీ మట్టి కలిపి ముఖానికి పూత వేయండి.

Published : 03 Nov 2022 00:34 IST

* సహజ పీలింగ్‌ ఏజెంట్‌గా పని చేస్తుంది బొప్పాయి. అందుకే మొటిమలూ, వాటి తాలూకు మచ్చలు ఉన్నప్పుడు... బొప్పాయి గుజ్జులో కాస్త టొమాటో రసం, చెంచా ముల్తానీ మట్టి కలిపి ముఖానికి పూత వేయండి. ఆరాక చల్లటి నీళ్లతో కడిగేసుకోండి. ఇలా తరచూ చేస్తే చాలు. మీరు కోరుకున్న మార్పు సాధ్యమవుతుంది.

* మురికి చర్మంపై చేరితే నిర్జీవంగా మారుతుంది. అందుకే క్లెన్సర్‌గా ఉపయోగపడే టొమాటోని స్క్రబ్బర్‌గా వాడేద్దాం. చిన్న టొమాటో ముక్కను చెంచా తేనె, అరచెంచా బ్రౌన్‌ షుగర్‌ కలిపిన మిశ్రమంలో అద్ది ముఖానికి మృదువుగా మర్దన చేయాలి. ఇలా చేస్తే మురికి వదులుతుంది. చర్మం స్వచ్ఛంగా మెరిసి పోతుంది.

* ముడతలు పడిన చర్మం వయసుని పెంచి చూపిస్తుంది. అందుకే కాస్తంత బియ్యప్పిండిలో చెంచా కీరదోస రసం కలిపి ముఖానికి రాసి మృదువుగా రుద్దేయండి. ఈ మిశ్రమం చర్మంపై ముడతల్నీ, మచ్చల్నీ తగ్గించి నిగారింపుతో కనిపించేలా చేస్తుంది.

* చర్మం సాగినట్లు కనిపిస్తోందా? పావుకప్పు పెసరపిండిలో ఒక కోడిగుడ్డు తెల్లసొన, చెంచా ఆలివ్‌నూనె వేసి ప్యాక్‌లా వేయాలి. ఇలా తరచూ చేస్తుంటే అసలు వయసు కంటే తక్కువగా కనిపించడం ఖాయం.

* ఎండ, కాలుష్యం... కారణాలేవైతేనేం... ముఖం కొన్నిసార్లు కళ తప్పుతుంది. అప్పుడు గుప్పెడు తులసి ఆకుల్ని పావులీటరు నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటికి కాస్త తేనె, చెంచా నిమ్మరసం, టేబుల్‌ స్పూన్‌ పెసరపిండి కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసి స్క్రబ్‌లా రుద్దాలి. ఇలా రోజూ సాయంత్రం చేస్తే... ముఖం తాజాగా మెరిసిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్