చలి నుంచి అందానికి రక్ష!

చలికాలంలో వేడివేడి నీళ్లతో స్నానం చేయాలని ఎవరికి మాత్రం ఉండదు? మీరూ అదే బాపతా! అయితే ఒక్కనిమిషం. మరిగే నీళ్లతో స్నానం చేయడం ఏమాత్రం మంచిది కాదు. గోరువెచ్చని నీళ్లనే వాడాలి.  

Published : 04 Nov 2022 01:11 IST

* చలికాలంలో వేడివేడి నీళ్లతో స్నానం చేయాలని ఎవరికి మాత్రం ఉండదు? మీరూ అదే బాపతా! అయితే ఒక్కనిమిషం. మరిగే నీళ్లతో స్నానం చేయడం ఏమాత్రం మంచిది కాదు. గోరువెచ్చని నీళ్లనే వాడాలి.  స్నానం చేసిన వెంటనే తప్పని సరిగా మాయిశ్చరైజర్‌ పట్టించండి. అప్పుడే చర్మంలో పగుళ్లు రావడం, ఎండిపోవడం, దురద వంటి సమస్యలు రావు.

* వేసవిలో ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీ వాడినట్టే.. ఈ కాలంలో చల్లగా ఉన్నప్పుడు హ్యుమిడిఫైయర్లు వాడాలి. లేదంటే చర్మం తేమను కోల్పోయి జీవం కోల్పోయినట్టుగా ఉంటుంది.

* చాలామంది తక్కిన రోజుల్లో వాడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులనే ఈ కాలంలోనూ వాడతారు. ఇలా అస్సలు చేయకూడదు. ఈ కాలంలో గాఢత తక్కువగా ఉండే వాటిని మాత్రమే వాడాలి. లేదంటే యాక్నె, మొటిమలు వంటి సమస్యలు తీవ్రమయిపోతాయి. వాటిలో సెరామైడ్స్‌, హెలురోనిక్‌ యాసిడ్స్‌ వంటివి ఉంటే యాక్నె ఇబ్బంది పెట్టదు.

* ఈ కాలంలో ఎండ తీవ్రత పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ... వాతావరణంలో చర్మానికి హానిచేసే అతినీలలోహిత కిరణాల ప్రభావం మాత్రం అలానే ఉంటుంది. అందుకే సన్‌స్క్రీన్‌ లోషన్‌ తప్పని సరి.

* ముఖంపై పేరుకున్న మృతకణాలు తొలగించడానికి స్క్రబ్బింగ్‌ చేస్తుంటాం కదా! ఈ కాలంలో దానికి దూరంగా ఉంటే మంచిది. జిడ్డు చర్మం ఉంటే వారానికోసారి చాలు. డ్రైస్కిన్‌ అయితే వద్దే వద్దు. అసలే పగిలిన చర్మం.. ఈ స్క్రబ్బింగ్‌కి మరింత పగిలి మంట పుడుతుంది.

* తినాలనిపించదు. దాహం వేయదు. అయినా సరే సమయానికి సలాడ్లు, జ్యూస్‌లు, ఆకుకూరలు, సూపులు తీసుకోవాల్సిందే. ఇవే చర్మాన్ని లోపలి నుంచి మెరిపిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్