జుట్టు రాలితే... ఇదే లోపం కావొచ్చు

జుట్టు ఎదుగుదలకు మినరళ్లూ, విటమిన్లతో పాటు ప్రొటీన్‌ కూడా చాలా అవసరం. అసలు వెంట్రుక అంటేనే ఒక ప్రొటీన్‌. మాంసాహారులకు చేపలూ, చికెన్‌, గుడ్ల నుంచి కావాల్సిన ప్రొటీన్‌ అందుతుంది.

Published : 05 Nov 2022 00:12 IST

* జుట్టు ఎదుగుదలకు మినరళ్లూ, విటమిన్లతో పాటు ప్రొటీన్‌ కూడా చాలా అవసరం. అసలు వెంట్రుక అంటేనే ఒక ప్రొటీన్‌. మాంసాహారులకు చేపలూ, చికెన్‌, గుడ్ల నుంచి కావాల్సిన ప్రొటీన్‌ అందుతుంది. శాకాహారులు అయితే, సెనగలు, పనీర్‌, పాలకూర, బీన్స్‌ వంటివి ఎక్కువ తింటే మేలు.

* శరీరంలో రక్త సరఫరా విషయంలో ఇనుముదే కీలకపాత్ర. ఇది రక్తసరఫరా బాగా జరిగేలా చూసి జుట్టును బలంగా, తొందరగా పెరిగేలా కూడా చేస్తుంది. జుట్టు నిర్జీవంగా, సన్నగా అవ్వడానికి ఇనుము లోపం కూడా కారణమే. ఎండుఫలాలూ, ఆప్రికాట్‌, గుడ్లూ, పాలకూర, మాంసంలో ఇది పుష్కలంగా ఉంటుంది.

* జుట్టు రాలిపోవడానికి మరో కారణం బయోటిన్‌ లోపం. ఇది సరైన స్థాయిలో ఉంటే జుట్టు బలహీనంగా మారడం, తెగిపోవడం లాంటి సమస్యలుండవు. ప్రొటీన్‌ను విడగొట్టి అమైనోఆమ్లాలూ, గ్లుకోజ్‌గా మార్చడంలో దీందే కీలకపాత్ర. ఇవి జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పీనట్‌బటర్‌, చేపలూ, గుడ్లూ, పుట్ట గొడుగులను ఆహారంలో ఎక్కువగా చేర్చుకుంటే ఈ సమస్య ఉండదు.

* విటమిన్‌-ఇ ని బ్యూటీ విటమిన్‌ అంటారు. ఇది సరైన మోతాదులో ఉంటే జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా ఉంటుంది. బాదంగింజల్లో ఈ విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆహారంలో చేర్చుకోవడమే కాదు నేరుగా తలకు కూడా పట్టించు కోవచ్చు. రెండు విటమిన్‌-ఇ క్యాప్య్సూల్స్‌ను కొబ్బరినూనెలో కలిపి మాడుకు రాసుకొని అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టుకు రక్తం, ఆక్సిజన్‌ సరఫరా మెరుగుపడతాయి.

* ఇనుమును గ్రహించడంలో విటమిన్‌-సి ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని వల్ల జుట్టు బలంగా మారుతుంది. ఇది నిమ్మజాతి ఫలాల్లో ఎక్కువగా లభిస్తుంది. కొన్ని సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఇప్పుడు విటమిన్‌-సి ఉంటోంది. అలాంటి వాటిని ఎంచుకున్నా మంచి ఫలితాలుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్