నిగనిగలాడే జుట్టుకి ఆలివ్‌నూనె

నల్లని ఒత్తైన జుట్టు కావాలని ఎవరికి ఉండదు. కానీ హార్మోన్ల ప్రభావం, అనారోగ్యాలు వంటివాటితో పాటు మరికొన్ని కారణాలు తోడైతే... జుట్టు రాలడం ఎక్కువవుతుంది.

Updated : 07 Nov 2022 13:09 IST

నల్లని ఒత్తైన జుట్టు కావాలని ఎవరికి ఉండదు. కానీ హార్మోన్ల ప్రభావం, అనారోగ్యాలు వంటివాటితో పాటు మరికొన్ని కారణాలు తోడైతే... జుట్టు రాలడం ఎక్కువవుతుంది. ఇలాంటప్పుడు దానికి కొంచెం సంరక్షణ కావాలి. అందుకు పరిష్కారమేంటంటే...

* జుట్టు పొడిబారి చింపిరిగా మారిందా...దాన్ని అలానే వదిలేస్తే చిట్లడం, ఆపై రాలడం ఖాయం. ఇలాంటప్పుడు దానికి తగినంత తేమ అవసరం. ఆలివ్‌ నూనెని తలకు పట్టించి ఓ పావుగంట మర్దన చేస్తే సరి. తర్వాత మాడుకి తగిలేలా ఆవిరి పట్టి గాఢత తక్కువ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే....క్రమంగా జుట్టుకి నిగారింపు వస్తుంది.

* తలస్నానం చేసినా కొన్నిసార్లు జుట్టులో మెరుపు కనిపించదు. బలహీనంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కాచి చల్లార్చిన గ్రీన్‌ టీని ఆలివ్‌ నూనెలో కలిపి జుట్టుకి రాసి ఆరనివ్వాలి. తర్వాత గంటాగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. మెరుపూ కనిపిస్తుంది.

* జుట్టు బలహీనంగా మారి ఊడిపోతున్నప్పుడు.. కొబ్బరిపాలల్లో చెంచా ఆలివ్‌నూనె, కాస్త కలబంద గుజ్జు, మూడు గుడ్లలోని తెల్లసొన కలిపి బాగా గిలకొట్టి తలకు పూతలా వేసుకోవాలి. అరగంట తర్వాత గాఢత తక్కువ షాంపుతో తలస్నానం చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్