చుండ్రు కనిపిస్తోంటే..

చలికాలం మొదలైందంటే చాలు.. కొందరిలో చుండ్రు వచ్చేస్తుంది. ఒకవైపు దురద, మరోవైపు తలస్నానం చేసిన మరుసటి రోజే తల, భుజాలపై కనిపిస్తూ చిరాకు కలిగిస్తుంది.

Published : 08 Nov 2022 00:07 IST

చలికాలం మొదలైందంటే చాలు.. కొందరిలో చుండ్రు వచ్చేస్తుంది. ఒకవైపు దురద, మరోవైపు తలస్నానం చేసిన మరుసటి రోజే తల, భుజాలపై కనిపిస్తూ చిరాకు కలిగిస్తుంది. మరేం చేయాలి?

* తలమీద చర్మం పొడిబారడం, దానికి సూక్ష్మక్రిములు తోడవడం చుండ్రుకు ఈ రెండూ కారణమవుతాయి. అందుకే ఎంచుకునే షాంపూలు మాడుకు ఎక్కువ తేమను అందించేవిగా ఉండాలి. దీంతోపాటు సూక్ష్మక్రిములతోనూ పోరాడగలగాలి. కాబట్టి క్లినికల్‌వి ఎంచుకోవడం మంచిదంటారు నిపుణులు. కండిషనర్‌ కూడా యాంటీ డాండ్రఫ్‌దే వాడితే మేలు.

* చల్లదనానికి బద్ధకిస్తాం కానీ చుండ్రు సమస్య ఉంటే వారానికి మూడుసార్లు తప్పక తలస్నానం చేయాలి. దురద దీనితో వచ్చే పెద్ద సమస్య. అలాగని అస్తమానూ గీకితే పొట్టుగా రాలి మీద పడుతుంది. దురద నుంచి తట్టుకునేదెలా అంటారా? ఆ ప్రాంతంలో వేలితో మృదువుగా రాయడమే.

* చల్లగాలికి ఎక్కువగా తిరగొద్దు. ఇంట్లోనూ హ్యుమిడిఫయర్‌ని ఏర్పాటు చేసుకుంటే గాలిలో తేమ ఏర్పడుతుంది. ఇది చర్మంతోపాటు కురులకూ సహకరించేదే.

* ఈ కాలంలో వేడి నీటితో స్నానం చేస్తుంటే ఎంత హాయి! కానీ ఇది చర్మంపై తేమను కోల్పోయేలా చేయగలదు. కాబట్టి గోరువెచ్చని నీటితోనే తలస్నానం చేయాలి. హెయిర్‌ డ్రైయర్‌ వంటివీ వాడక పోవడమే మేలు. తరచూ కొబ్బరినూనె పెడుతోంటే మాడుకు తేమ అందుతుంది. అయితే రాసిన ప్రతిసారి తలస్నానం తప్పనిసరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్