మగువ మెడలో బొట్టు మాల...

ఆధునికత ఒంటపట్టించుకున్న అమ్మాయిలు సైతం అలనాటి సంప్రదాయ నగల్ని తెగ ఇష్టపడుతున్నారు.

Updated : 09 Nov 2022 04:37 IST

ఆధునికత ఒంటపట్టించుకున్న అమ్మాయిలు సైతం అలనాటి సంప్రదాయ నగల్ని తెగ ఇష్టపడుతున్నారు. అందుకే మొన్న కాసులపేరూ, తర్వాత గుత్తపూసల హారాలూ, నిన్న రామ్‌పరివార్‌ డిజైన్లూ...ఇలా పాతకాలం నాటి నగలెన్నింటికో కొత్త హంగులద్ది అలంకరించేసుకున్నారు. ఇప్పుడు బొట్టు నగల వంతు... గొలుసులకు నుదుటన పెట్టుకునే గుండ్రటి బొట్టు పరిమాణంలో బిళ్లలను హారాలకు అమరుస్తారు. వీటిలో అచ్చ బంగారంతో చేసినవి మాత్రమే కాదు...కెంపులూ, పచ్చలూ,వజ్రాలు వంటి విలువైన రాళ్లను అద్దుకున్న డిజైన్లు ఎన్నో కనికట్టు చేస్తున్నాయి. మరి మగువల మెడలో ఈ మాలల్ని మీరూ ఓసారి చూద్దురూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్