ముఖానికి స్వర్ణకాంతి

అబ్బ... భలే ఉన్నావని తోటివాళ్లు మెచ్చుకుంటే ఎవరికైనా అపురూపమే. కానీ అందుకు రసాయనాలుండే సౌందర్య సాధనాలు వాడాలంటే భయమేస్తుంది కదూ! నిజానికి సహజ పదార్థాలతోనే అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు. ఎలాగంటారా...

Published : 10 Nov 2022 00:07 IST

అబ్బ... భలే ఉన్నావని తోటివాళ్లు మెచ్చుకుంటే ఎవరికైనా అపురూపమే. కానీ అందుకు రసాయనాలుండే సౌందర్య సాధనాలు వాడాలంటే భయమేస్తుంది కదూ! నిజానికి సహజ పదార్థాలతోనే అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు. ఎలాగంటారా...

* నీళ్లలో గులాబీ రేకలు వేసి బాగా మరిగించి పొడి సీసాలో భద్రపరచండి. ఈ రోజ్‌వాటర్‌ ఎండ వల్ల జరిగే హాని నుంచి తప్పిస్తుంది. ముఖం మృదువుగా కాంతివంతంగా మారుతుంది.

* వేపాకు నూరి ముఖానికి రాసి కాసేపాగి చల్లటి నీళ్లతో కడగండి. కుదిరినప్పుడల్లా ఇలా చేస్తే అందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖానికి తేటదనమూ వస్తుంది.

* గంధంపొడి, తేనె, నీళ్లు కలిపిన పసుపు ముద్దను ముఖానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత చల్లటి నీళ్లతో కడగండి. ముడతలూ, మచ్చలూ రావు. వయసూ మీదపడదు.

* ముల్తానీ మట్టిలో తేనె, రోజ్‌వాటర్‌ ఒక్కో చెంచా చొప్పున కలిపి ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే బ్లాక్‌హెడ్స్‌, వైట్‌హెడ్స్‌, పింపుల్స్‌కి చెక్‌పెట్టినట్టే.

* ఫెయిర్‌నెస్‌ క్రీములంటూ ఖరీదైన బ్రాండులు కొన్నా ప్రయోజనం ఉండదు. బదులుగా పాలలో ఐదారు చుక్కల నిమ్మరసం, కొద్దిగా కుంకుమ పూవు మేళవించి ముఖానికి మర్దనా చేయండి. కొద్దిరోజుల్లోనే మీ ముఖంలో గొప్ప మార్పు గమనిస్తారు.

* పసుపు, శనగపిండి సమపాళ్లలో తీసుకుని తగినన్ని పాలు కలిపి ముఖానికి రాసి, ఎండాక కడిగేయండి. చర్మం స్వర్ణకాంతులీనుతుంది.

* కలబందలోని కెరొటిన్‌, సి, ఇ విటమిన్లు శరీరానికెంతో మేలు చేస్తాయి. దీని గుజ్జును ముఖానికి పట్టించి పావుగంట తర్వాత కడిగేస్తే అందం, ఆరోగ్యం మీ సొంతం.

* కమలా తొక్కలతో ముఖానికి మసాజ్‌ చేయడం వల్ల చర్మం తాజాగా, తేజోవంతంగా ఉండటమే కాదు నునుపుదనం వస్తుంది.

* చల్లటి పాలు లేదా పెరుగును ముఖానికి రాసి పావుగంటాగి కడిగేయండి. ముఖం మెరిసిపోతుంది.

* ఈ సహజసిద్ధ పదార్థాలతో ఏ బ్యూటీ ప్రొడక్టులూ సాటిరావు. అందాన్నీ ఇనుమడింప చేస్తాయి, ఎలాంటి అనర్థాన్నీ తెచ్చిపెట్టవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్