Updated : 11/11/2022 04:18 IST

పాపిట బిళ్ల.. తిన్నగా!

దుస్తులేవైనా సంప్రదాయ లుక్‌ రావాలంటే పాపిట బిళ్ల ఉండాల్సిందే! ముఖానికి అదనపు ఆకర్షణ తేవడంలోనూ దీనిది ప్రధాన పాత్రే! చిక్కల్లా.. తల కాస్త కదిలినా పక్కకు వెళ్లిపోతుంది, లేదా మెలితిరుగుతుంది. తల అలాగే నిటారుగా ఉంచడం, అస్తమానూ సరి చేసుకోవడం రెండూ చిరాకే కదూ! అందుకే ఈ చిట్కా.... ఇంట్లో ఐల్యాష్‌ గ్లూ ఉందా? బిళ్ల సరిగ్గా అమరే చోట దాన్ని రాయండి. గ్లూ మీద పాపిట బిళ్ల అలాగే ఉండి పోతుంది. శుభ్రతా తేలిక, చర్మానికి హానీ జరగదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని