నిమిషాల్లో మెరిసిపోవాలా?

మాయిశ్చరైజర్‌ రాసి, ఫౌండేషన్‌ లేదా బీబీ క్రీమ్‌ రాయడానికి సమయం పడుతుంది కదా! బదులుగా ఈ రెంటినీ కలిపి రాసేయండి. ముఖం డల్‌గా అనిపిస్తోంటే లిక్విడ్‌ హైలైటర్‌నీ కొన్ని చుక్కలు కలపొచ్చు. దాంతో ముఖం మెరుస్తుంది....

Published : 11 Nov 2022 00:17 IST

పూజలు, వేడుకల సమయమిది! అందంగా కనిపించాలి.. అదీ తక్కువ సమయంలో! ఎలాగని ఆలోచిస్తున్నారా? ఇదిగో.. ఇలా!

మాయిశ్చరైజర్‌ రాసి, ఫౌండేషన్‌ లేదా బీబీ క్రీమ్‌ రాయడానికి సమయం పడుతుంది కదా! బదులుగా ఈ రెంటినీ కలిపి రాసేయండి. ముఖం డల్‌గా అనిపిస్తోంటే లిక్విడ్‌ హైలైటర్‌నీ కొన్ని చుక్కలు కలపొచ్చు. దాంతో ముఖం మెరుస్తుంది.

మచ్చలు, కళ్ల కింద నలుపు ఉన్నాయనిపిస్తే కన్సీలర్‌ వాడండి.

చలికాలమే కాబట్టి, పౌడర్‌ మేకప్‌ పెద్దగా అవసరం ఉండదు. మరీ జిడ్డుగా అనిపిస్తోంటే గడ్డం, నుదురు, బుగ్గలకు కాంపాక్ట్‌ లేదా పౌడర్‌ మేకప్‌ను పైపైన అద్దితే సరిపోతుంది.

అందమైన కళ్లు మరింత అందంగా కనిపించాలంటే కాటుక తప్పనిసరి. కాజల్‌ పెన్సిల్‌ వాటర్‌ప్రూఫ్‌ది ఎంచుకొని కళ్లంతటా మరీ మందంగా కాకుండా పెడితే చాలు. ఇక తీరైన కనుబొమలకు ఐబ్రో పెన్సిల్‌ తప్పనిసరి. దీన్నే ఐలైనర్‌గానూ వాడేయండి. షేప్‌ రాలేదన్న కంగారు ఉండదు. కనురెప్పలకు తేలిగ్గా శుభ్రం చేయగల, వాటర్‌ ప్రూఫ్‌ మస్కారా వేస్తే లుక్‌ మారిపోతుంది.

నచ్చిన రంగు లిప్‌స్టిక్‌ లేదా లిప్‌గ్లాస్‌ వేసుకోండి. దీన్నే వేలిపై రాసి, బుగ్గలు, కనురెప్పలపై అద్దితో సరి. బ్లష్‌, ఐమేకప్‌ కూడా పూర్తయిపోతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్