వెన్నతో వెలిగిపోదామా!

శీతగాలుల ప్రభావం చర్మంపై ఎక్కువగా ఉంటుంది. పొడారి, దురద, దద్దుర్లు వంటి సమస్యలు మొదలవుతాయి. అందుకే దీని పరిరక్షణ విషయంలో మొక్కల ఆధారిత బటర్‌ను ఎంచుకుంటే మంచిదంటున్నారు నిపుణులు.

Published : 14 Nov 2022 00:18 IST

శీతగాలుల ప్రభావం చర్మంపై ఎక్కువగా ఉంటుంది. పొడారి, దురద, దద్దుర్లు వంటి సమస్యలు మొదలవుతాయి. అందుకే దీని పరిరక్షణ విషయంలో మొక్కల ఆధారిత బటర్‌ను ఎంచుకుంటే మంచిదంటున్నారు నిపుణులు.

మొక్కల ఆధారిత బటర్‌లో ఫ్యాటీ యాసిడ్లు, పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచుతూ, చల్లగాలి నుంచి చర్మం పొడారనివ్వకుండా కాపాడతాయి. వాటిలో షియాబటర్‌ ఒకటి. ఇది అన్ని చర్మతత్వాలకూ నప్పుతుంది.

కోకోవా బటర్‌.. బటర్స్‌ అన్నింటిలోకీ తేలికగా, చర్మంలో త్వరగా ఇంకిపోవడం కోకోవా బటర్‌ ప్రత్యేకత. సున్నిత లేదా జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి కూడా ఇది మంచి ఫలితాలనిస్తుంది. పొడారడం, జీవం లేనట్లుగా అనిపించడం, వృద్ధాప్య ఛాయలు త్వరగా రావడం వంటి సమస్యలకు ఈ బటర్‌ పరిష్కారాన్నిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మచ్చలనూ మాయం చేస్తాయి. చర్మాన్నీ  తళుకులీనేలా మార్చేసే శక్తి కోకోవా బటర్‌కుంది. ఇది చర్మంపై ఏర్పడే స్ట్రెచ్‌ మార్కులను పోగొడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

మ్యాంగో సీడ్‌ బటర్‌.. మామిడి గింజల నుంచి తయారుచేసే ఈ బటర్‌ను ఎక్కువగా ఫేస్‌క్రీం, మాయిశ్చరైజర్లలో వినియోగిస్తారు. జిడ్డును దూరం చేసి తేమగా ఉంచే చేసే శక్తి ఈ బటర్‌లో పుష్కలంగా ఉంటుంది. ఏ, సీ, ఈ విటమిన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ వంటి పోషకాలతో ఈ బటర్‌ చర్మానికి మెరుపునిచ్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. మొటిమలూ, మచ్చల్ని తగ్గిస్తుంది. దీన్ని రోజూ రాసుకుంటుంటే...క్రమంగా ముఖంపైన ముడతలూ, గీతలూ మాయవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్