జీన్స్‌ కొంటున్నారా...

మల్టీ టాస్కింగ్‌ అంటే ముందడుగు వేసే అలవాటున్న వారికి స్కిన్నీ జీన్స్‌ సరిగ్గా నప్పుతుంది. నిత్యం ఉత్సాహవంతమైన జీవనశైలి ఉన్నవారి వార్డ్‌రోబ్‌లో ఈ జీన్స్‌ ఉండాల్సిందే. మృదువుగా, సాగే గుణంతో ఈ డెనిమ్‌ ఫ్యాబ్రిక్‌ సౌకర్యవంతంగా ఉంటుంది. జతగా టాప్స్‌, స్కర్టు, కుర్తీలు బాగుంటాయి.

Updated : 16 Nov 2022 05:11 IST

స్టైల్‌కు చిరునామాగా నిలిచే జీన్స్‌ను కొనేముందు ప్రస్తుత  ట్రెండ్స్‌ ఏంటో చెబుతున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. అలానే జీవనశైలికి నప్పే జీన్స్‌ గురించీ వివరిస్తున్నారు.

స్కిన్నీ..

ల్టీ టాస్కింగ్‌ అంటే ముందడుగు వేసే అలవాటున్న వారికి స్కిన్నీ జీన్స్‌ సరిగ్గా నప్పుతుంది. నిత్యం ఉత్సాహవంతమైన జీవనశైలి ఉన్నవారి వార్డ్‌రోబ్‌లో ఈ జీన్స్‌ ఉండాల్సిందే. మృదువుగా, సాగే గుణంతో ఈ డెనిమ్‌ ఫ్యాబ్రిక్‌ సౌకర్యవంతంగా ఉంటుంది. జతగా టాప్స్‌, స్కర్టు, కుర్తీలు బాగుంటాయి. ఆఫీస్‌ పార్టీలు, మామూలు సందర్భాలకూ స్కిన్నీ జీన్స్‌ నప్పుతాయి.


స్ట్రెయిట్‌..

నాలుగు దశాబ్దాల నుంచి ఈ తరహా జీన్స్‌ యువత మనసును దోస్తున్నాయి. సిగరెట్‌ జీన్స్‌గానూ పిలిచే ఈ స్ట్రెయిట్‌ జీన్స్‌ కార్పొరేట్‌ సెట్‌గా నిలిచిపోయాయి. వీటిపై బిగుతైన టాప్స్‌ నుంచి వదులైన చొక్కాల వరకూ ఏవైనా బాగుంటాయి.


రిప్డ్‌..

మోకాలి నుంచి మధ్యలో కట్‌ లేదా హోల్స్‌ ఉన్నట్లుగా ఉండే రిప్డ్‌ జీన్స్‌ ప్రస్తుత ట్రెండ్‌. యువతరం అభిమానిస్తున్న ఈ జీన్స్‌ ఫ్యాషన్‌గానే కాదు.. సృజనాత్మకంగానూ కనిపిస్తుంది. దీనిపై స్వెట్‌ షర్టు, బ్లేజర్‌, షార్ట్‌ టాప్స్‌వంటివన్నీ ఇట్టే నప్పుతాయి. సాయంకాలం పార్టీలకు ఇది సరిగ్గా సరిపోతుంది.


ఫ్లేర్‌..

ఫ్లేర్‌ జీన్స్‌ కాలేజీ అమ్మాయిలకే కాదు, ఉద్యోగినులకూ ఇట్టే నప్పుతాయి. వదులుగా, బెల్‌ స్టైల్‌ లేదా బూట్‌కట్‌తోనూ ఇవి ఫ్యాషన్‌కు చిరునామాగా మారాయి. సౌకర్యంగానూ ఉంటాయి.


మరిన్నిరకాలు..

దులుగా, ఎక్కువ పాకెట్స్‌ ఉండే కార్గోజీన్స్‌ ఏ సందర్భంలోనైనా సౌకర్యంగా ఉంటాయి. తల్లుల కోసం హైవెయిస్ట్‌, శరీర సౌష్టవానికి తగినట్లుగా, లాంగ్‌బ్యాక్‌ పాకెట్స్‌తో మామ్‌జీన్స్‌ ప్రత్యేకంగా వస్తున్నాయి. యాంకెల్‌ స్కిన్నీ జీన్స్‌, యాంకిల్‌పై వరకు మాత్రమే వచ్చే టామ్‌కాట్‌ తరహావి, బూట్‌కట్‌ వంటివి క్లాసిక్‌ లుక్‌ ఇస్తాయి. డ్రాస్ట్రింగ్‌ వెయిస్ట్‌తో జాగర్‌ జీన్స్‌, జెగ్గింగ్స్‌ వంటివీ ప్రయత్నించి చూడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్