బంగారంలాంటి మోము కోసం...

ముఖాన్ని ముందుగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే చర్మ రంధ్రాల్లోని మురికితో నూనెలు, బాక్టీరియా వంటివి కలిసి మొటిమలు, మచ్చలకు కారణమవుతాయి. మృదువైన క్లెన్సర్‌తో శుభ్రం చేసి, 5-10 నిమిషాలు ముఖానికి ఆవిరిపట్టాలి. దాంతో చర్మ రంధ్రాలు తెరుచుకొని వ్యర్థాలు, అదనపు నూనె వంటి మలినాలన్నీ బయటకొచ్చి, రక్తప్రసరణ బాగా జరుగు తుంది.

Updated : 16 Nov 2022 01:06 IST

ఆభరణాలు, అలంకరణ.. ఎంతున్నా.. మోము బంగారంలా మెరిస్తేనే.. అందం సహజమనిపిస్తుంది. ఇంట్లో సహజ పదార్థాలతోనే గోల్డ్‌ ఫేషియల్‌ చేసుకుని మెరిసిపోవచ్చు అంటున్నారు నిపుణులు.

ముఖాన్ని ముందుగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే చర్మ రంధ్రాల్లోని మురికితో నూనెలు, బాక్టీరియా వంటివి కలిసి మొటిమలు, మచ్చలకు కారణమవుతాయి. మృదువైన క్లెన్సర్‌తో శుభ్రం చేసి, 5-10 నిమిషాలు ముఖానికి ఆవిరిపట్టాలి. దాంతో చర్మ రంధ్రాలు తెరుచుకొని వ్యర్థాలు, అదనపు నూనె వంటి మలినాలన్నీ బయటకొచ్చి, రక్తప్రసరణ బాగా జరుగు తుంది. చర్మానికి మృదుత్వాన్నిచ్చే కొల్లాజెన్‌కు ఈ ఆవిరి తోడ్పడుతుంది. మృదువైన స్పాంజి లేదా దూది ఉండతో ముఖాన్ని తుడిచి శుభ్రం చేయాలి. చెంచా చొప్పున గులాబీనీరు, పాలను కలిపిన మిశ్రమంలో దూది ఉండను ముంచి ముఖానికి, మెడకు రాసి ఆరనిచ్చి కడిగితే చాలు. ఇది గోల్డ్‌ క్లెన్సర్‌గా మారి ముఖచర్మాన్ని పూర్తిగా శుభ్రం చేస్తుంది.  

గోల్డ్‌ స్క్రబ్‌..

చర్మకణాలు ఉత్తేజితమవడానికి, మృతకణాలను తొలగించడానికి గోల్డ్‌ స్క్రబ్బింగ్‌ చేయాలి. చెంచా చొప్పున చక్కెర, తేనె, నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖమంతా రాసి 10 నిమిషాలు మృదువుగా రుద్ది కడగాలి. దీనివల్ల రక్తప్రసరణ బాగా జరిగి చర్మం మెరుస్తుంది. మెత్తని వస్త్రంతో తుడిచి, ముఖాన్నంతా మునివేళ్లతో పది నిమిషాలు మర్దనా చేస్తే, రక్తప్రసరణ వేగంగా జరిగి చర్మంపై ఒత్తిడి తగ్గుతుంది. రెండు చెంచాల కొబ్బరినూనెలో చెంచా షియా బటర్‌ వేసి బాగా కలిపి ముఖమంతా వలయాకారంలో మర్దనా చేస్తున్నట్లు మృదువుగా పావుగంటసేపు రాయాలి. ఇది గోల్డ్‌క్రీం మసాజ్‌లా మారి చర్మాన్ని మెరిపిస్తుంది.  

ఫేషియల్‌..

రెండు చెంచాల కలబంద గుజ్జును ముఖానికంతా రాసి అయిదునిమిషాలు మర్దనా చేయాలి. ఇది మాయిశ్చరైజర్‌లా మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, గీతలు, సూర్యరశ్మివల్ల వచ్చే మచ్చలు, పిగ్మంటేషన్‌ వంటివన్నీ తగ్గిస్తుంది. చివరిగా గోల్డ్‌ ఫేషియల్‌గా చెంచా శనగపిండి, పావు చెంచా పసుపు, చెంచా చొప్పున పెరుగు, గంధంపొడి ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి అరగంట ఆరనిచ్చి చన్నీళ్లతో కడిగితే చాలు. ముఖం బంగారుకాంతులీనుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్