మెరిపించే పూల పూతలు!

గులాబీలు: గుప్పెడు గులాబీ రేకల్ని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి. బాగా ఆరాక ఓ ఐదు నిమిషాలు ఎండలో ఉంచి పొడిచేయాలి. అందులో కాస్త పెసరపిండీ, చెంచా గులాబీనూనె కాసిన్ని పాలు కలిపి ముఖానికి పూత వేయాలి.

Published : 18 Nov 2022 00:16 IST

గులాబీలు: గుప్పెడు గులాబీ రేకల్ని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి. బాగా ఆరాక ఓ ఐదు నిమిషాలు ఎండలో ఉంచి పొడిచేయాలి. అందులో కాస్త పెసరపిండీ, చెంచా గులాబీనూనె కాసిన్ని పాలు కలిపి ముఖానికి పూత వేయాలి. కాసేపయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే చాలు. ఈ పూత వల్ల చర్మానికి తేమ అంది మృదువుగా మారుతుంది. ముఖంపై మచ్చలూ తగ్గుతాయి.


మల్లె: శుభ్రంగా కడిగిన మల్లెపూలను మెత్తగా నూరి కప్పు కొబ్బరినూనెలో వేసి మరిగించాలి. బాగా మరిగి కొద్దిగా అయ్యాక దానిలో చెంచా ఉలవపిండి, చెంచా పచ్చి కొబ్బరి, కాస్త తేనె చేర్చి ముఖానికి రాసి రుద్దాలి. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది. దీనివల్ల మృతకణాలు, మొటిమలు తొలగిపోతాయి. మల్లె వార్ధక్యపు ఛాయల్ని కూడా తగ్గిస్తుంది.


కలువ: కలువ రేకల్ని ముద్దగా నూరి పెట్టు కోవాలి. ఇందులో చెంచా పాలు, కాస్తంత తేనె, రెండు చెంచాల పాలపొడి కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ఫేస్‌కి ప్యాక్‌ వేస్తే చర్మం బిగుతుగా మారి యవ్వనంగా కనిపిస్తారు. ఇందులోని పోషకాలు ముడతలూ, మచ్చలూ వంటి వృద్ధాప్య ఛాయల్నీ నియంత్రిస్తాయి.


మందారం: రెండు చెంచాల మందార పూల పొడిలో చెంచా పాలపొడి, తేనె కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకుంటే చర్మం తాజాగా మెరిసి పోతుంది.


బంతి: కాసిన్ని బంతిరేకలూ, గులాబీ రేకల్ని తీసుకుని ముద్దలా చేయాలి. అందులో కాస్త పెరుగు, చెంచా నిమ్మరసం కలిపి పూతలా వేసుకోవాలి. పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే ముఖôపై పేరుకున్న టాన్‌ క్రమంగా పోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్