కొత్త స్టైల్‌ చేయించుకుంటున్నారా?

జుట్టు పొడవు మాత్రమే తగ్గించు కోవాలనుకుంటున్నారా? అయితే కాస్త పనితనం తెలిసిన వారెవరైనా సరిపోతారు. పూర్తి స్టైల్‌నే మార్చేసుకోవాలంటే మాత్రం చేయి తిరిగిన నిపుణులను ఆశ్రయించాల్సిందే.

Published : 21 Nov 2022 00:21 IST

జుట్టు పొడవు మాత్రమే తగ్గించు కోవాలనుకుంటున్నారా? అయితే కాస్త పనితనం తెలిసిన వారెవరైనా సరిపోతారు. పూర్తి స్టైల్‌నే మార్చేసుకోవాలంటే మాత్రం చేయి తిరిగిన నిపుణులను ఆశ్రయించాల్సిందే. ఒకట్రెండు రోజులు ఆలస్యమైనా ఫర్లేదు. కానీ.. కోరిన లుక్‌ ఇచ్చే వాళ్ల గురించి తెలుసుకున్నాకే ముందుకెళ్లండి.

* మీరొకటి అనుకుంటారు. స్టైలిస్ట్‌కి వివరిస్తారు. తీరా పూర్తయ్యే సరికి అనుకున్నట్టు రాదు. అప్పుడు తల పట్టుకున్నా లాభం ఉండదు. ఒకటి.. మీ మనసులో ఏముందో చెప్పగానే అందరూ అర్థం చేసుకోవాలని లేదు. రెండు.. మీ వివరణలోనూ లోపాలుండొచ్చు. ఈ బాధ తప్పాలంటే..
స్టైలింగ్‌కు సంబంధించి ఫొటోలు దగ్గరుంచుకోవాలి.

* మీకో స్టైల్‌ బాగా నచ్చింది. చూడటానికి నచ్చితే సరిపోతుందా? మీకూ నప్పాలిగా! కాబట్టి, స్టైలిస్ట్‌ సలహా కోరండి. మీ ముఖాకృతికి సరిపోతుంది అంటే భేషుగ్గా చేయించేసుకోవచ్చు. అలాగే కేశ సంరక్షణకు సంబంధించి ఏవైనా ప్రశ్నలడిగారనుకోండి.. నిజాయతీగా సమాధానాల్వివండి. అప్పుడే మీకనుకూలమైన, సులువుగా మేనేజ్‌ చేసుకునే స్టైల్‌ చేయగలరు.

* లుక్‌లో కొత్తదనం కావాలి.. కానీ పొడవు తగ్గడం నచ్చదు చాలామందికి. ఆ విషయాన్నీ ముందే చెప్పేయండి. కొందరు గతంలో చేయించుకున్నప్పుడు బాగుందని మళ్లీ మళ్లీ అక్కడికే వెళుతుంటారు. ఏదైనా తేడా వస్తే.. పోయినసారి బాగా చేశావ్‌.. ఇప్పుడేంటి చెడగొట్టావ్‌ అంటూ గొడవ పడతారు. రోజూ వాళ్లెంత మందికి స్టైల్‌ చేస్తుంటారు? ఎప్పుడో మీకు చేసింది ఇంకా ఎలా గుర్తుంటుంది? అందుకే మీకు నచ్చినప్పుడే కొన్ని ఫొటోలు తీసుకోవాలి. స్టైలింగ్‌కి ముందే వాటిని చూపిస్తే.. ఈ సమస్యలుండవు.

* స్టైల్‌ చేయించుకున్నప్పుడు బాగానే కనిపిస్తుంది. తీరా తలస్నానం చేశాక లుక్‌ మారిపోతోందంటారు చాలామంది. అదెప్పుడూ అలాగే కనిపించాలన్నా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ముందే స్టైలిస్ట్‌నే కనుక్కుంటే సరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్