చమక్కు మనిపించే అందం... గులాబీ నీళ్ల సొంతం

చక్కటి సువాసనతోపాటూ అందాన్ని రెట్టింపు చేసే సుగుణాలెన్నో నింపుకొన్న గులాబీ నీళ్లను... ఎలా ఉపయోగించాలో తెలుసా?

Published : 22 Nov 2022 00:16 IST

చక్కటి సువాసనతోపాటూ అందాన్ని రెట్టింపు చేసే సుగుణాలెన్నో నింపుకొన్న గులాబీ నీళ్లను... ఎలా ఉపయోగించాలో తెలుసా?

* గులాబీ నీళ్లలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు కూడా ఎక్కువ. ఇవి చర్మంపై మచ్చల్ని తగ్గిస్తాయి. పావు కప్పు గులాబీ నీళ్లల్లో కొద్దిగా తేనె కలిపి... మునివేళ్లతో ముఖానికి రాసి మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముఖం మెరిసిపోతుంది.

* బయటకి వెళ్లినా, ఇంట్లోనే ఉన్నా... మురికి, జిడ్డు వంటివి ఇట్టే ముఖం మీదకి చేరి నిర్జీవంగా మార్చేస్తాయి. అందుకే రోజుకి ఒకసారైనా గులాబీ నీళ్లల్లో ముంచిన దూదితో తుడవాలి. ఇది యాస్ట్రింజెంట్‌గా పనిచేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ముఖం తాజాగా కనిపిస్తుంది. యాంటీ ఏజింగ్‌ గుణాలూ కూడా ఇందులో ఉండటం వల్ల ముడతలూ, వలయాలూ అదుపులో ఉంటాయి.

* జుట్టు పొడిబారి కాంతివిహీనంగా కనిపిస్తోంటే కప్పు కొబ్బరి పాలల్లో, పావు కప్పు గులాబీనీరు, చెంచా నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన బాగా కలిపి కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించండి. తర్వాత ఓ అరగంట ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఈ మిశ్రమం జుట్టుకి సహజ కండిషనర్‌గా పనిచేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్