ముడతలు తగ్గించే వ్యాయామాలివి...

ఎంత అందంగా తయారైనా... కళ్ల కింద నల్లటి వలయాలు, ముఖం మీద ముడతలు కనిపిస్తుంటే చూడ్డానికి బాగుండదు.

Published : 22 Nov 2022 00:16 IST

ఎంత అందంగా తయారైనా... కళ్ల కింద నల్లటి వలయాలు, ముఖం మీద ముడతలు కనిపిస్తుంటే చూడ్డానికి బాగుండదు. వాటికి సౌందర్య లేపనాలు సరిపోవు. రోజూ ఈ ముఖ వ్యాయామాలు చేయండి. మార్పు మీకే కనిపిస్తుంది.

* కళ్లకింద వలయాలు, ముడతలు తగ్గాలంటే... రెండు చేతుల చూపుడూ, మధ్య వేళ్లను ముందుగా కంటికొలను దగ్గర పెట్టి....చూపుడు వేలుని మాత్రం నెమ్మదిగా మర్దన చేస్తూ కొన దగ్గరకు తీసుకెళ్లాలి. ఈ సమయంలో మధ్య వేలితో చర్మాన్ని బిగుతుగా పట్టి ఉంచాలి. ఇలా కనీసం రెండు నిమిషాలైనా చేయాలి.

* కనురెప్పలు సాగితే... చూపుడు వేలితో కనుబొమల పైన, చర్మాన్ని ఎత్తిపట్టుకోవాలి. మధ్యవేలితో రెప్ప కింది భాగంలో నొక్కి ఉంచాలి. కాసేపాగి... కంటిని 15, 20 సార్లు మూసి తెరిస్తే సరి.

* నుదుటి మీద ముడతలు... తరచూ నుదురు చిట్లించడం, కళ్లు ఎగరేయడం చేసేవారికి నుదుటిమీద ముడతలు ఎక్కువగా కనిపిస్తాయి. కనుబొమల నుంచి నుదిటి వరకూ ఉన్న చర్మాన్ని లాగి పట్టుకోవాలి. ఇలా కనీసం రోజూ పది సార్లు చేస్తుంటే అవి క్రమంగా తగ్గుతాయి.

* మూతి చుట్టూ... మూతి తిప్పడం, తరచూ ద్రవ పదార్థాలను స్ట్రాలతో తాగే వారిలోనూ, వృద్ధాప్య ఛాయలు పలకరిస్తున్నప్పుడూ నోటి చుట్టూ ముడతలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు నోటిలో గాలి నింపి, పెదాలను బిగపట్టాలి. దీంతో బుగ్గలు ఉబ్బుతాయి. అప్పుడు పెదాలను చేత్తో కాసేపు నొక్కి ఉంచాలి. ఇలాచేస్తే నోటి చుట్టూ ముడతలు క్రమంగా దూరమవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్