పాదాలు పగులుతున్నాయా?

శీతకాలంలో ముఖం, జుట్టు, చేతులతో పాటు... పాదాల మీద కూడా ఎక్కువే శ్రద్ధపెట్టాలి. లేదంటే పగిలిపోయి నొప్పికీ కారణం అవుతాయి.

Updated : 23 Nov 2022 04:57 IST

శీతకాలంలో ముఖం, జుట్టు, చేతులతో పాటు... పాదాల మీద కూడా ఎక్కువే శ్రద్ధపెట్టాలి. లేదంటే పగిలిపోయి నొప్పికీ కారణం అవుతాయి.

*  రాత్రి నిద్రపోయేముందు పావు కప్పుకొబ్బరి నూనెలో రెండు చుక్కల లవంగ నూనె చేర్చి పాదాలకు రాసి బాగా మర్దన చేయండి. ఇలా రోజూ చేస్తుంటే రక్త ప్రసరణ సక్రమంగా జరిగి ఆరోగ్యంగా ఉంటాయి. నొప్పులూ తగ్గుతాయి. పాదాలూ పగలవు.

* నువ్వుల నూనె, రెండు చెంచాల పెసరపిండి, కాస్త పెరుగు కలిపి పాదాలకు బాగా రుద్దండి. ఆపై బ్రష్‌తో మరోసారి రాస్తే సరి. పాదాల మీద మృతకణాలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా మారుతుంది. తేమా అందుతుంది. 

* గుప్పెడు గులాబీ రేకలు, రెండు తులసి రెమ్మలు, చెంచా ఆలివ్‌ నూనె నీళ్లల్లో వేసి మరగబెట్టాలి. గోరువెచ్చగా అయ్యాక కాసేపు అందులో పాదాలను నాననివ్వండి. ఆపై ప్యూమిక్‌ స్టోన్‌తో రుద్దితే మృతచర్మం తొలగిపోతుంది. కోమలంగానూ కనిపిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్