పాతచీరతో కొత్తందాలు

అమ్మాయిలకి మహా ఇష్టమైన పదం ఫ్యాషన్‌. నుదుటి మీది స్టిక్కర్‌ దగ్గర్నుంచి కాలి చెప్పుల వరకూ లేటెస్ట్‌ ట్రెండ్‌ ఫాలో అవ్వాలనుకుంటాం.

Updated : 23 Nov 2022 04:20 IST

అమ్మాయిలకి మహా ఇష్టమైన పదం ఫ్యాషన్‌. నుదుటి మీది స్టిక్కర్‌ దగ్గర్నుంచి కాలి చెప్పుల వరకూ లేటెస్ట్‌ ట్రెండ్‌ ఫాలో అవ్వాలనుకుంటాం. ఒక్కోసారి మునుపున్న వాటిల్లోంచే కొత్త మోడల్స్‌ సృష్టిస్తారు ఫ్యాషన్‌ డిజైనర్లు. ‘పాత చీరలతో కొత్త డ్రెస్సులు’ అలాంటిదే.

* కాటన్‌, సింథటిక్‌ చీరలతో పేచీ లేదు. కట్టినన్నాళ్లు కట్టి తీసేయొచ్చు. పట్టు లేదా ఖరీదైన ఫ్యాన్సీ చీరలు కబోర్డ్స్‌లో మూలుగుతుంటాయి. ఆఫీసుకు కట్టలేం. పెళ్లీ పేరంటాలు వస్తాయనుకున్నా మునుపటి వేడుకల ఫొటోలు సాక్ష్యంగా ఉంటాయి కనుక మళ్లీ మళ్లీ కట్టలేం. మరేం చేయాలంటే... వాటితో కుర్తీ, లాంగ్‌ ఫ్రాక్‌, గాగ్రా లాంటివి కుట్టిస్తే అనేక సందర్భాల్లో ధరించొచ్చు. చున్నీ, ష్రగ్‌ మార్చామంటే ఎప్పటికప్పుడు కొత్తదనం వస్తుంది.

* సంప్రదాయంగా కనిపించాలనుకునే వారు చీరలతో లంగా ఓణీలు కుట్టించుకోవచ్చు. రెండు చీరలను కత్తిరించి రెండు సగభాగాలను దీనిది దానికి, దానిది దీనికి మారిస్తే భిన్నమైనవి రూపొందుతాయి. ఒక్కోసారి ఓణీ లేదా బ్లవుజు వేరొకటి ధరిస్తే కొత్తది కాబోలనిపిస్తుంది.

* చీర అంచు.. గౌను లేదా కుర్తీకి అడుగున ఉండేలా కుట్టిస్తే కొందరికి నచ్చదు. పాత చింతకాయలా తోస్తుంది. అలాంటి వారి కోసం మెడ దగ్గర డిజైన్‌లా కళాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇలాంటివి పండుగల్లో ప్రాచీనతకు ఆధునికతను అద్దినట్లు అలరిస్తాయి.

* కొన్ని చీరలతో లంగా కుట్టించేసి కుదిరితే కొంగుతో లేదా కాంట్రాస్ట్‌గా ఉండే మరో వస్త్రంతో లాంగ్‌ బ్లౌజ్‌ కుట్టించుకోవచ్చు. లేదా అనుకూలంగా ఉండే వెస్ట్రన్‌ టాప్‌ ధరించొచ్చు. అటు సాంప్రదాయంగా, ఇటు ట్రెండీగా ఉంటుంది.

* పాత చీరతో మ్యాక్సీలా కుట్టించి స్టైలిష్‌ యోక్‌ పెట్టిస్తే అదుర్స్‌ అనిపిస్తుంది.

* కళాత్మక హృదయం ఉండాలే గాని పాత చీరలు పెట్టె చీకుడు పట్టకుండా వాటిని ఎన్ని రకాలుగానైనా ఫ్యాషనబుల్‌గా కుట్టించుకుని అందాల బొమ్మల్లా సందడి చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్