తేలికగా మెరిపించే.. జె-బ్యూటీ!

చర్మ సంరక్షణకు ప్రాధాన్యమిచ్చే ప్రతి అమ్మాయి.. స్కిన్‌ కేర్‌ రొటీన్‌ పాటించాల్సిందే. ఈ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో సలహా ఇస్తారు. దాంతో వాడే ఉత్పత్తులు పెరిగి పోతాయి. కాలంతో పరుగులు పెట్టే ఈ తరానికి అంత సమయమెక్కడిది? అదే సింపుల్‌గా అయిపోయే మార్గముంటే? అలా ఆలోచించే వారికి ‘జె-బ్యూటీ’ సరైన మార్గం.

Published : 26 Nov 2022 00:14 IST

చర్మ సంరక్షణకు ప్రాధాన్యమిచ్చే ప్రతి అమ్మాయి.. స్కిన్‌ కేర్‌ రొటీన్‌ పాటించాల్సిందే. ఈ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో సలహా ఇస్తారు. దాంతో వాడే ఉత్పత్తులు పెరిగి పోతాయి. కాలంతో పరుగులు పెట్టే ఈ తరానికి అంత సమయమెక్కడిది? అదే సింపుల్‌గా అయిపోయే మార్గముంటే? అలా ఆలోచించే వారికి ‘జె-బ్యూటీ’ సరైన మార్గం.

జపనీయులు అనుసరించే చర్మసంరక్షణ ప్రక్రియకు జె-బ్యూటీ అనిపేరు. ‘తక్కువతో ఎక్కువ లాభం’ వీళ్లు అనుసరించే పద్ధతి. అలాగే సహజ పదార్థాలకే ప్రాధాన్యం ఇస్తారు. చర్మాన్ని సున్నితంగా చూసుకోవాలని చెబుతారు. గట్టిగా రుద్దడం, గరుకైన వాటితో స్క్రబింగ్‌కి దూరంగా ఉండాలంటారు. లేదంటే చర్మంలో ఇన్‌ఫ్లమేషన్‌ ఏర్పడి ముడతలు, చర్మం సాగడం వంటి వాటికి కారణం అవుతుందంటారు. అందుకే తక్కువ ఉత్పత్తులతో కోరుకున్న అందాన్ని సాధించేలా చూసుకుంటారు. జె-బ్యూటీ స్కిన్‌ కేర్‌లో మూడే దశలుంటాయి.

1. క్లెన్సింగ్‌.. రెండుసార్లు తప్పనిసరిగా చేయాలి. మొదటిసారి నూనె ఆధారిత క్లెన్సర్‌తో రుద్దాలి. ముఖమంతా క్లెన్సర్‌ రాసి, వేలి కొసలతో మృదువుగా రుద్దాలి. ఆపై గోరువెచ్చని నీటితో కడిగేయాలి. మేకప్‌, దుమ్ము, ధూళి పోవడమే కాదు.. చర్మానికి కొంత పోషణా కావాలి. అందుకోసమే ఆయిల్‌ క్లెన్సర్‌ వాడతారు. ఫోమ్‌ క్లెన్సర్‌! ఎంత శుభ్రం చేసినా.. దుమ్ము, మేకప్‌ రసాయన అవశేషాలు చర్మరంధ్రాల్లో మిగిలి పోతాయి. అవీ పోవాలంటే లోతైన శుభ్రత కావాలి. అందుకే ఇది.

2. హైడ్రేట్‌.. జె-బ్యూటీ లక్ష్యం.. మృదువైన పట్టులాంటి చర్మం. అది కావాల్సినంత తేమ చర్మానికి అందినపుడే సాధ్యం. అందుకే క్లెన్సింగ్‌ చేసిన వెంటనే టోనర్‌ని తప్పక ఉపయోగిస్తారు.

3. మాయిశ్చర్‌.. ఇక ఆఖరిది.. మాయిశ్చరైజింగ్‌. ఇది తేమను లాక్‌ చేసి, రక్షణనీ ఏర్పరుస్తుంది. చర్మతీరుకి తగ్గది ఎంచుకోవడం ప్రధానం.

ఇదీ వందల ఏళ్ల నుంచి జపాన్‌ భామల పద్ధతి. చర్మం ఆరోగ్యంగా ఉంటేనే.. అసలైన అందమనేది వీరి భావన. తేలిగ్గానే ఉంది కదూ! మనమూ పాటిద్దామా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్